మనం నమ్మిన దేవుడికి పూజలు చేస్తుంటాం, కోరికలు తీర్చమని మొక్కులు తీరుస్తాం. ఏమి చేసిన ఎక్కువ శాతం మంది స్వలాభం కోసమే చేస్తారు. తమకి మంచి జరగాలి, తమ కుటుంబం బాగుండాలనే భావనతోనే గుడికి వెళ్లి పూజా కార్యక్రమాలకి చేస్తుంటారు. పక్క వారి గురించి మొక్కే వారు, పొరుగు వారికి మంచి జరగాలని పూజలు చేసే వారు చాల తక్కువమంది ఉంటారు. కాని అమెరికాలో కొందరు తెలుగు ఎన్నారైలు ఎలాంటి స్వలాభం ఆలోచించకుండా 41 రోజుల అయ్యప్ప దీక్ష చేశారు.

 

రోజు రోజుకి మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్న భారతదేశంలో, మహిళల భద్రత కోసం తెలుగు ఎన్నారైలు అయ్యప్ప దీక్ష  చేశారు. అమెరికాలోని నార్త్ కరోలినా, సౌత్ కరోలినా రాష్ట్రాలకి చెదిన 100 మంది ఎన్నారైలు అయ్యప్ప దీక్ష తీసుకొని 41 రోజుల పాటు కష్టతరమైన నియమ,నిబంధనలు పాటిస్తూ దీక్ష ను పూర్తి చేశారు. ఆకరిరోజు దీక్ష విరమించటానికి స్థానికంగా ఉన్న షిరిడీ సాయి ఆలయం లో ఇరుముడి ధరించి బస్సులో, దాదాపు 9 గంటలు ప్రయాణించి ఫ్లోరిడాలోని తాంపా లో అయ్యప్ప స్వామి ఆలయం లో దీక్ష ని విరమించారు.

 

 

 ఈ దీక్ష లో పాల్గొన్న వారి లో 20 మంది చిన్నారులు కూడా ఉన్నారు. దీక్ష విరమించిన తరువాత వారు మాట్లాడుతూ, భారత దేశంలో తెలుగు రాష్ట్రాల్లోని మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టాలని, వారి భద్రత కు ఎలాంటి ఇబ్బంది రాకుడదని, అయ్యప్పని వేడుకుంటూ మాలధారణ చేసి దీక్షను విజయవంతంగా పూర్తి చేసామని చెప్పారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: