కోటి ఆశలతో కోరుకున్నవిద్య ని అభ్యసించటం కోసం విదేశాలకు పరుగులు తీస్తున్నారు ఎంతోమంది యువత. మంచిజీవితాన్ని పొంది, తల్లితండ్రులను కష్టం లేకుండా చూసుకోవటమే వీరిలో ఎంతోమంది కల.తల్లితండ్రులు కూడా వారు పడ్డ కష్టాన్ని పైకి చెప్పకుండా చదివించుకుంటూ, తమపిల్లలు  స్థిరపడితే చాలు అనుకుంటారు. విదేశాలకివెళ్లి చదువు పూర్తిచేసుకొని, మంచి ఉద్యోగం తో తిరిగివస్తాడు అని ఎదురు చూసేతల్లితండ్రులకి వారి కొడుకు తిరిగిరాని లోకాలకి వెళ్ళాడు అని తెలిస్తే వాడు పడేనరకం మాటల్లో చెప్పలేరు

 

పొన్నపల్లి జగదీష్ , కృష్ణ జిల్లా, నందిగామ నుండి వెటర్నరీ వైద్య విద్య కోసం 2016 లో ఫిలిఫీన్స్ వెళ్ళాడు . దురదృష్టవసాత్తు జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణించాడు. మూడేళ్ళ కోర్సు పూర్తి చేసుకొని, వచ్చే ఏడాది ఇంటికి వచేస్తాడని ఎదురు చూస్తున్న అతని తల్లితండ్రులకి ఈ మరణ వార్త పుట్టెడు దుఖాన్ని మిగిల్చింది. ప్రస్తుతం జగదీష్ 3 సంవత్సరాల విద్యని పూర్తి చేసుకొని, నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.

 

సోమవారం జగదీశ్ తన ద్విచక్ర వాహనం పై  షాపింగ్ కి వెళ్తుండగా, వెనుక నుంచి వస్తున్న బస్సు అతడి బైక్ ని బలంగా డీ కొట్టింది. దాంతో ఒక్కసారిగా బండితో సహా ఎగిరి పడ్డ జగదీశ్ కి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఉన్న పళంగా హాస్పిటల్ కి తీసుకువెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స తీసుకుంటూనే జగదీష్   ప్రాణాలు విడిచాడు.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: