భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే మనదైన ప్రతిభతో రికార్డ్ లు క్రియేట్ చేస్తూ ఉంటారు. తాజాగా దుబాయ్ లో ఎన్నో ఏళ్ళ నుంచీ ఉంటున్న భారత సంతతికి చెందిన ఓ ఎన్నారై కుటుంభం తమ కుమార్తెకి సంగీతంలో తర్ఫీదు ఇప్పించింది. ఆమెకి సంగీతం మీద ఉన్న మక్కువ  కేవలం 13 ఏళ్ళ వయసులోనే రెండు ప్రపంచ రికార్డ్ లు గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డ్ గెలుచుకునేలా చేసింది. ఆ వివరాలలోకి వెళ్తే..

 

ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాలలో ప్రతిభచూపించే పిల్లలకి ప్రతీ ఏడాది “గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ” ని ప్రధానం చేస్తారు. ఈ అవార్డ్ పేరుతో ప్రత్యేక పురస్కారాలు ఇవ్వడం కూడా ఆనవాయితీగా జరుగుతోంది. ఈ క్రమంలోనే దుబాయ్ లో ఉంటున్న 13 ఏళ్ళ ప్రవాస బాలిక సుచేత సతీష్ ఈ అవార్డ్ గెలుచుకుంది. ఈ అవార్డ్ లను ప్రధానం చేసేది. అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్, మరియు ఏఆర్ రెహ్మాన్ లు.

 

ఈ అవార్డ్ ల ప్రధాన కార్యక్రమంలో ముఖ్య అతిదిగా నోబెల్ పురస్కార గ్రహీత సత్యార్ది రానున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు. ఇదిలాఉంటే ఈ అవార్డ్ కి ఎంపికైన ప్రవాస బాలిక సుచేత మాట్లాడుతూ తాను ప్రపంచ వ్యాప్తంగా రెండు రికార్డ్ లు సృష్టించానని, అందుకు గాను తనకి ఈ అవార్డ్ లు ఇస్తున్నట్టుగా తెలిపింది. అంతేకాదు ఈ బాలిక ఒకే వేదికపై 120 బాషలలో పాడి మరొక రికార్డ్ క్రియేట్ చేసింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: