అమెరికా  ఇరాన్ లమధ్య గొడవలు రోజు రోజుకి ముదురుతున్నాయి. ఇరాన్ అగ్రశ్రేణి సైనిక జరనర్ ఖాసిం సులేమానీని అమెరికా హత్య చేయడంతో మరింత ఆగ్రహానికి గురయిన ఇరాన్ అమెరికాని తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని బహిరంగంగా ప్రకటించిన తరువాత ట్రంప్ సైతం తీవ్ర హెచ్చరికలు చేసినా పట్టించుకొని ఇరాన్ ట్రంప్ ప్రకటన చేసిన మరుసటి రోజే..

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=WHITE HOUSE' target='_blank' title='white house-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>white house</a> high alert

అమెరికా ఆయుధ భాండాగారం పై దాడులు చేసింది. ఈ దాడులు మేము చేశాం అంటూ ట్రంప్ తలకి రూ. 575 కోట్ల వెలగట్టింది. అంతేకాదు ఇది జస్ట్ సాంపిల్ మాత్రమే అంటూ మరిన్ని దాడులకి సిద్దంగా ఉండండి అంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిణామాలని ఊహించని ట్రంప్ ప్రభుత్వం ఒక్క సారిగా ఇరాన్ చేసిన హెచ్చరికలతో అమెరికాలో, ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ నివాసం ఉండే వైట్ హౌస్ లో హై అలెర్ట్ ప్రకటించారు.

 

వైట్ హౌస్ చుట్టూ పక్కల ప్రాంతాలలో మరియు చెక్ పాయిట్లలలో అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు సోదాలు నిర్వహించి, సాయుధ భద్రతా బలగాలతో పటిష్ట వ్యవస్థని ఏర్పాటు చేశారు. అమెరికాపై మిస్సైల్ దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించిన నేపధ్యంలో అమెరికాలోని ట్రంప్ నివాసమైన వైట్ హౌస్ లో భద్రతని పెంచామని ప్రకటించారు. ఇరాన్ ని తీవ్రస్థాయిలో హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు తన వైట్ హౌస్ చుట్టూ భద్రతని పెంచుకోవడంతో ఇరు దేశాల మధ్య ఈ పరిస్థితి చివరికి యుద్డంవైపుగా అడుగులు వేయిస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమెరికా , ఇరాన్ ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: