పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. పలానా అబ్బాయికి, పలానా అమ్మాయికి పెళ్లి చేస్తున్నాం అని తల్లితండ్రులు వేయించే శుభలేఖలు వారి సంతోషానికి అద్దం పట్టేలా ఉంటాయి. కానీ ఇప్పుడు యువత రోజుకో రకం ట్రెండ్ తో  ముందుకు వెళుతున్నారు. ఇదివరకు పెళ్లి రోజులకి పార్టీ ఇచ్చేవారు, తరువాత లవ్ సక్సెస్ అయినందుకు, ఇంకొన్ని రోజులు ముందుకు వెళ్ళాక బ్రేకప్ పార్టీలు అంటూ మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు  ఓ  యువతి ఒకడుగు ముందుకు వేసింది. తనకి వచ్చిన ఆలోచనతో  కొత్త ట్రెండ్ సెట్ చేయబోతోంది...

 

పాకిస్థాన్ కు చెందిన ఆర్టిస్ట్, నిర్మాత అయిన కోమల్ ఆష్ తన విడాకులకి ఆహ్వానం పలికింది. ఇదేం అంటే, పెళ్లి అందరి ముందు చేసుకున్నప్పుడు విడాకులు కూడా అలానే జరగాలన్న ఆలోచనట తనది. ఇందుకోసం, ఆ మహిళ తన విడాకుల వేడుకను సెలబ్రేట్ చేసుకుంటున్న చిత్రంతో పాటు, దానిపై నా విడాకుల కార్యక్రమానికి  అందరికీ సాదర ఆహ్వానం అంటూ ఓ కార్డ్స్ ను ప్రింట్ చేయించుకుంది. అదే చిత్రం లో ఆమె గుండెను చేతితో పిండేస్తున్నట్లు కనిపిస్తుంది.

 

ఇదంతా తనకి ఇష్టం లేని మనిషి నుంచి వేరవుతున్న ఆనందంలో చేస్తోందట. ఏ అమ్మాయికైనా పెళ్లి చేసుకున్న మనిషి అర్ధం చేసుకుంటూ మంచిగా ఉంటే సంతోషం కానీ, వేధిస్తూ హింసకు గురిచేస్తున్నప్పుడు ఆ అమ్మాయి నరకం అనుభవిస్తుంది. ఆ నరకం లోంచి బయటపడలనుకునే మహిళలకు ఈ విడాకులు నిజంగానే ఓ వరంతో సమనంలా అనిపిస్తాయి అలా         విడిపోయే రోజును వేడుకలా జరుపుకోవటంలో ఎలాంటి తప్పు లేదంటోంది ఆమె.  ఈ కొత్త ట్రెండ్ ను ఎంత మంది ఫాలో అవుతారో వేచి చూడాలి

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: