ప్రపంచంలో ఏ మూల ఎలాంటి అద్భుతాలు జరిగినా అందులో భారతీయుడు పాత్ర ఎక్కడో ఒక చోట ఉండితీరక మానదు. ప్రపంచ నలుమూలల భారతీయుల మూలాలు అంతగా నాటుకుపోయాయి. ముఖ్యంగా అమెరికా వంటి అగ్రరాజ్యంలో మరింతగా ఇండో అమెరికన్స్ మార్క్  ఉంటుంది. మరో సారి రుజువయ్యింది.  అమెరికాకి  అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థగా ఉన్న నాసా ( అమెరికా అంతరక్ష సంస్థ) త్వరలో నిర్వహించబోయే చంద్ర మండల, అంగారక యాత్రలలో భాగంగా వెళ్లనున్న 11 మంది వ్యోమగాములలో ఒక భారత సంతతి వ్యక్తి కూడా ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు.

 

అంగారక యాత్రలో భాగంగా వెళ్లనున్న ఈ 11 మందికి నాసా శిక్షణని ఇస్తోంది. ఈ బృందంలో భారత సంతతి వ్యక్తైన రాజా చారి ఎంపిక కాబడ్డారు. హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ లో రెండేళ్ళ శిక్షణ అనంతరం ఆయన గ్రాడ్యుయేట్ పొందారు. శిక్షణ విజయవంతం అయ్యినందుకు గాను నాసా నుంచీ సిల్వర్ పిన్ లని పొందారు కూడా అయితే

 

ఈ శిక్షణ అనంతరం బంగారు పిన్ లు ఇవ్వటం నాసా సాంప్రదాయం. ఇదిలాఉంటే ఇప్పటి వరకూ అమెరికా నాసా యాత్రలో భారత సంతతి వ్యక్తులు అయిన కల్పనా చావ్లా , సినీతా విలియమ్స్ పాల్గొనగా ఆ తరువాత అంతటి అరుదైన అవకాశం దక్కించుకున్న మూడో వ్యక్తి  రాజా చారి మాత్రమే. ఈ విషయంపై స్పందించిన రాజా చారి. నా ఎన్నాళ్ళ కలో ఇప్పుడు నేరవేరుతోంది అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: