అమెరికాకి వలస వెళ్ళిన విదేశీయులలో అత్యధిత శాతం మంది భారతీయులేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత్ తరువాత రెండో స్థానంలో చైనా ఉంది. అమెరికాలో ఏ రంగంలోనైనా సరే భారతీయులు తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే అమెరికాలో ఉండే విదేశీయులలో భారతీయులు అత్యధికులైతే, భారతీయులలో అత్యధిక శాతం మంది నివసిస్తున్న వారిలో సిక్కు సోదరులు అధికంగా ఉంటారు. అంతేకాదు

 

సిక్కులకి అమెరికాలో ప్రత్యేకమైన గౌరవం కూడా ఇస్తారు అమెరికన్స్. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం అమెరికా వ్యాప్తంగా ఉన్న సిక్కు సోదరు అందరూ కలిసి సుమారు 10 లక్షల పైమాటేనట. 2020 జనాభా లెక్కల ప్రకారం  సిక్కులని ప్రత్యేకమైన జాతిగా గుర్తిస్తామని అక్కడి సెన్సస్ అధికారులు తాజాగా ప్రకటించారు. ఈ ప్రకటనతో ఒక్క సారిగా భారతీయ సిక్కు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

 

తాము రెండు దశాబ్ధాలుగా ఈ హోదా కోసం ప్రయత్నలు చేస్తున్నామని ఎట్టకేలకి మా ప్రయత్నాలు ఫలించాయని అక్కడి సిక్కు సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. శాన్ డియాగో సిక్కు సొసైటీ ప్రెసిడెంట్ బజీత్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జాతీయంగా సిక్కు సమాజానికి మాత్రమే కాకుండా అమెరికాలోని ఇతర జాతులకి కూడా ఈ అవకాశం దక్కిడానికి అవకాశాలు సుగమం చేసినట్టు అయ్యిందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: