అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై డెమోక్రటిక్ పార్టీ ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మాన  ప్రక్రియ వేగవంతమవుతోంది. ఈ అభిశంసన తీర్మానం ప్రక్రియ సెనేట్లో  ప్రారంభమైంది. ఈ సందర్భంగా సెనేట్లో సభ్యులు అందరూ ఎలాంటి పక్షపాతంతో తాము వ్యవహరించమని జ్యూరీ ఎదుట ప్రమాణం చేశారు. అయితే  ఈ అభిశంసన తీర్మానం ప్రక్రియ చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది.

 

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉండటంతో ఈ అభిశంసన తీర్మానం అమెరికాలో ఎంతో ఆసక్తిని రేపుతోంది. ఒక పక్క ఎన్నికలకి ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూ దూసుకువెళ్తున్న సమయంలో ట్రంప్ కి ఈ ప్రక్రియ పెద్ద తల నెప్పులు తెచ్చిపెడుతుందని, ఎన్నికల్లో అభిశంసన తీర్మాన ప్రభావం తప్పకుండా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.



ఇదిలా ఉంటే ట్రంప్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లో జడ్జీలుగా నలుగురు డెమోక్రటిక్ పార్టీకి చెందిన వారే ఉన్నా వారందరూ న్యాయానికి కట్టుబడి ఉంటామని ప్రమాణాలు చేశారు. ట్రంప్ పై డెమోక్రాట్లు ఇప్పటికే రెండు అభియోగం మోపుతూ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఒకటి  డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో నిలిచిన జో బిడెన్ పై  విచారణ జరపాలని ఉక్రెయిన్ పై ఒత్తిడి తీసుకురావడం ఒక కారణమైతే. మరొకటి ట్రంప్ తనపై విచారణ జరగకుండా కాంగ్రెస్ ని అడ్డుకోవడం మరొక కారణం. తాజాగా ఈ తీర్మానం సెనేట్ ముందుకు చేరడంతో ట్రంప్ భవిష్యత్తుపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: