అమెరికాలో భారతీయుల వరుస మరణాలు ఈ మధ్య కాలంలో అధికమవుతున్నాయి. ఎన్నారై విద్యార్ధులుగా స్వదేశం విడిచి అమెరికా వెళ్లి చదువుకుంటున్న వారు ఊహించని రీతిలో మృతి చెందటం వారి తల్లి తండ్రులని ఆందోళనలకి గురిచేస్తోంది. గడిచిన రెండు నెలల కాలంలో మృతి చెందిన భారతీయ విద్యార్ధుల సంఖ్య దాదాపు 10 కి తగ్గదంటే నమ్మలేని నిజమే. వేరు వేరు కారణాలతో, అమెరికాలో వివిధ ప్రాంతాలలో వీరు మృతి చెందినా అమెరికాకి విద్యార్ధులని పంపిన తల్లి తండ్రులు మాత్రం ప్రతీ రోజు ఆందోళన చెందుతున్నారు..తాజాగా ఇండో అమెరికన్ యువతి అనుమానాస్పద మృతి ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

 

అమెరికాలో చికాగో సమీపంలో వెస్ట్ ఫీల్డ్ పార్క్ సమీపంలో ఓ కారులో ఓ మహిళా మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు. ఆమె భారత సంతతికి చెందిన సురీల్ గా గుర్తించారు. ఆమె తల్లి తండ్రులు అమెరికాలో డాక్టర్లుగా చేస్తూ  ఎన్నో ఏళ్ళ క్రితమే వచ్చి స్థిరపడ్డారని తెలుస్తోంది. సురీల్ కూడా చికాగోలోని ఓ యూనివర్సిటీ లో  గత ఏడాది ఎంబీయే పూర్తి చేసుకుంది.అయితే

 

సురీల్ కనపడకుండా పోయిన రోజునే తల్లి తండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ రోజు నుంచీ విచారణ చేపట్టిన పోలీసులకి చికాగోలోనే ఓ కారులో అనుమానాస్పద స్థితిలో ఆమె మృతదేహం కనపడటంతో విచారణ వేగవంతం చేశారు. ఆమె కారు డిక్కీ లో దుప్పట్లో కప్పి ఉండటం చూసిన తల్లి తండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే ఆమె హత్యకి గల కారణాలు ఇంకా తెలియకపోయినా కొందరు అనుమానితులని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: