ఈ మధ్యకాలంలో ప్రయాణికులు ఎలా ఉన్నారు అంటే.. చెప్పకూడదు లెండి! విమానంలో ప్రయాణించే ప్రయాణికుల వీడియోలు సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి. ఆ విమానంలో ప్రయాణికులు కొందరు చేసిన పనులు మన పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తే.. మరి కొన్ని వీడియోలు చిరాకు తెప్పిస్తాయి. 

 

ఆలా చిరాకు తెప్పించిన వీడియోలు చాలానే ఉన్నాయి.. ఆ వీడియోలు ఏంటి అంటే చెప్పలేము కానీ.. ప్రస్తుతం మాత్రం ఓ చిల్లర ప్రయాణికుడు చేసిన వీడియోని చూస్తే ఆ తోటి ప్రయాణికులకు ఏ కాదు మనకు కూడా చిరాకు తెప్పిస్తుంది. ఆలా ఉంది ఆ వీడియో. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 

 

ఓ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు.. తన కాలికి ఉన్న బూటును తీసి చేతిలో పట్టుకొని విమానంలోని ఎయిర్‌ వెంట్‌ కింద ఆరబెట్టాడు. దీంతో బూటులో ఉన్న దుర్వాసన మొత్తం విమానం అంతా వ్యాపించడంతో తోటి ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యారు. ఈ చెత్త నిర్వాకాన్ని అంత తోటి ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

 

దీంతో ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చెయ్యగా అందులో ఏకంగా 2.5 లక్షల వ్యూస్, 8వేలకు పైగా లైక్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెట్టి మండిపడుతున్నారు. కాగా ఈ ఘటన ఎక్కడ జరిగింది.. ఎప్పుడు జరిగింది అనేది మాత్రం బయటకు రాలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: