ఇంగ్లాండ్ లో జరిగిన ఓ భారతీయ యువకుడు హత్య ఘటన కలకలం రేపుతోంది. పబ్ లో ఉన్న భారత సంతతికి చెందిన ఓ యువకుడిపై విరుచుకుపడిన కొందరు దుండగులు తీవ్రంగా కొట్టి అక్కడి నుంచీ పారిపోయారు. కాసేపటికే ఆ యువకుడు  చనిపోవడంతో దాడికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు ఆ యువకుడు ఎవరు..?? దాడి ఎందుకు జరిగింది అనే వివరాలలోకి వెళ్తే...

 

 

ఇంగ్లాండ్ లోని నాటింగ్ హాం ట్రెంట్ యూనివర్సిటీ చదువుకుంటున్న భారత సంతతి వ్యక్తి అర్జున్ సింగ్ నిన్నటి రాత్రి స్లాగ్ అండ్ లేట్టూస్ అనే పబ్ సమీపంలో కొందరితో గొడవ పడ్డాడు. ఆ తరువాత పబ్ లోకి వెళ్ళిపోయాడు. గొడవ పడిన వాళ్ళు బలవంతంగా అతడిని బయటకి లాక్కొచ్చి మరీ దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయాలపలయ్యాడని, చికిత్స కోసం స్థానికంగా ఉన్న  ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణిచాడని తెలిపారు పోలీసులు..

 

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అక్కడి సీసీ టీవీ పుటేజ్ లని పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని మరిన్ని ఆధారాలు అక్కడ లభ్యమయాయని త్వరలో నిందితులని పట్టుకుని హత్య తాలూకు వివరాలు వెల్లడిస్తామని పోలీసులు ప్రకటించారు. అయితే హత్య ఎందుకు జరిగింది అనే విషయం మాత్రం ఇప్పటికి కూడా తెలియక పోవడం మిస్టరీగా మారిదని అంటున్నారు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రిచర్డ్ మంక్...

మరింత సమాచారం తెలుసుకోండి: