టర్కీలో భారీ భూకంపం సంభవించింది.. ఈ భూకంపంలో 550 మంది తీవ్రంగా గాయపడగా అందులో 18మంది మరణించారు. టర్కీ దేశంలో సంభవించిన భూకంప ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.8 గా నమోదైంది. అయితే ఈ భూకంపం కారణంగా టర్కీలో భారీ ఆస్థినష్టం జరిగింది. 

 

అయితే..  ఈ ప్రభావం కారణంగా ఆస్థి నష్టం జరిగినట్టు డిజాస్టర్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. టర్కీ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భూకంప బాధితులకు సహాయం అందిస్తున్నారు. కాగా భూకంప బాధితులకు ఆహారం, దుప్పట్లు, ఇతర వస్తులు అందిస్తున్నారు.

 

కాగా ఈ భూకంపంపై యూరోపియన్ మెడిటెరాన్ సిస్మాలాజికల్ కేంద్రం అధికారులు మాట్లాడుతూ.. గాజియన్టెప్ నగరానికి తూర్పున 218 కిలోమీటర్ల దూరంలో 15 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని చెప్పారు. టర్కీ దేశంలోని అన్ని విభాగాల అధికారులు ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఈర్డాగాన్ ఆదేశించారు.

 

అయితే ఇటీవలే కాలంలోనే కొన్ని వేరు వేరు చోట్ల భూకంపాలు సంభవించాయి. అయితే ఆ భూకంపాలు వేరు వేరు చోట్ల జరిగినప్పటికీ ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికే మన భారత్ లో కూడా ఢిల్లీ వంటి నగరాల్లో అప్పుడప్పుడు భూకంపాలు సంభవిస్తున్నాయి. నేపాల్ వంటి దేశాల్లో కూడా ఈ భూకంపాలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: