ఎవరైనా... మనుషులు ఎవరితో ప్రేమలో పడుతారు.. అబ్బాయితో అమ్మాయి.. అమ్మాయితో అబ్బాయి.. లేకపోతే అమ్మతో కూతురు.. ఇలా ఎవరితో అయినా మనిషితోనే ప్రేమలో పడుతారు. సరే ప్రేమ గురించి వదిలేద్దాం.. మరి పెళ్లి ? మనిషిని మరో మనిషి పెళ్లి చేసుకుంటాడు ఇది సహజం.. ఒకొక్కసారి మనిషి జంతువుతో పెళ్లి చేసుకుంటారు.. 

 

కానీ ఎవరైనా వస్తువులతో.. వాహనాలతో ప్రేమలో పడి వాటిని పెళ్లి చేసుకుంటారా? కానీ అక్కడ ఆ యువతీ నిజంగానే ఓ యువతీ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటుంది. ఏంటి అనుకుంటున్నారా? నిజం.. పైన కనిపించే ఫొటోలో యువతీ.. మనిషి సృష్టించిన విమానాన్ని వివాహం చేసుకుంటుంది. 

 

బెర్లిన్‌కు చెందిన మిషెల్ కోబ్కే అనే మహిళ ఈ వింత ప్రకటన చేసింది. 2014లో బెర్లిన్‌లోని టెగెల్ ఎయిర్‌పోర్ట్‌లో బోయింగ్ 737-800 అనే విమానాన్ని మొదటిసారి చూసి ప్రేమలో పడినట్టు.. అప్పటి నుంచి ఆ విమానానికి స్కాట్జ్ అని పేరు కూడా పెట్టుకుని అలానే పిలుస్తూ వస్తోంది. 

 

విమానం తయారుచేసిన చోట ఓ కిటికి దగ్గర నుంచి చూస్తూ తాను విమానంతో ప్రేమలో పడినట్టు మిషెల్ చెప్పింది. గతేడాది సెప్టెంబర్‌లో మొదటిసారి ఈ విమానానికి ముద్దు పెట్టానని.. ఆ రోజును తన జీవితంలో మర్చిపోలేనంటూ సంబరపడుతూ చెప్తుంది. ఈ విమానంతో కలిసి ఉంటే తనకు సమయం కూడా తెలియదని తెలిపింది. అయితే ఈమె ఆ విమానాన్ని ఈ మార్చ్ లో పెళ్లి చేసుకోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: