ట్రంప్ ప్రభుత్వం కొన్ని నెలల క్రితం గ్రీన్ కార్డ్ విషయంలో తీసుకువచ్చిన నిభందన విషయంలో సర్వాత్రా వ్యతిరేకత అలుముకుంది. ఇన్ని కండిషన్లు పెడితే అసలు గ్రీన్ కార్డ్ ని కనీసం చూడలేని పరిస్థితి నెలకొంటుందంటూ భారతీయులు అందరూ సర్వాత్రా నిరసన తెలిపారు. గ్రీన్ కార్డ్ విషయంలో ప్రభుత్వం కొత్తగా చేసిన నిభందన ఏమిటంటే..

 

అమెరికాలో మెడికల్ ఎయిడ్ , ఫుడ్ స్టాంప్స్ , హౌసింగ్ వోచర్స్ మొదలగు ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్న వలసదారులకి గ్రీన్ కార్డ్ నిరాకరించాలని గతంలో తీర్మానం చేసింది. ఈ విధానం వలన ముఖ్యంగా అత్యధికంగా భారతీయులు పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై కోర్టుని ఆశ్రయించిన కొందరు తమకి హక్కుగా రావాల్సిన గ్రీన్ కార్డ్ విషయంలో ఈ కొత్త కండిషన్స్ నష్టం చేకూర్చుకున్నాయని ఈ కండిషన్స్ తీసేయాలని కోరింది.

 

అయితే ఈ విషయంపై ఆమోదం తెలుపుతూ కోర్టులో న్యాయమూర్తులు ఐదుగురు ఈ పాలసీకి మద్దతు ఇవ్వగా నలుగురు మాత్రం వ్యతిరేకించారు.ఈ తాజా నిభందన పై స్టే ఇస్తూ రెండో సర్క్యూట్ ఇచ్చిన తీర్పుని కొట్టేస్తూ ఈ నిభందనలు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలాఉంటే గ్రీన్ కార్డ్ కావాలనుకునే వారు భవిష్యత్తులో తాము ప్రభుత్వం పధకాలు పొందమని లిఖిత పూరవకంగా రాసి ఇవ్వాల్సి ఉంటుంది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: