సాటి మనిషి ఆపదలో ఉంటే వారికి సాయం చేయాలనే ఆలోచన అందరికి వస్తుంది. కానీ ఆలోచన కాకుండా ఆచరణలో పెట్టి చూస్తే ఆ సంతోషం వేరు...ఆ కిక్కే వేరు. ఇలాంటి సంఘటనే అమెరికాలో చోటు చేసుకుంది ఎప్పుడూ తుపాకుల మోతతో, ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరిని కాల్చి చంపేసి కల్చల్ హెచ్చుగా ఉన్న అమెరికాలో జరిగిన ఓ సంఘటన అందరిని కదిలించింది. ఒక్కటిగా ఉంటే కాదు ఒకరికి ఒకరుగా ఉంటే సాధించలేనిది లేదని మరో సారి ఋజువు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.

https://twitter.com/i/status/1221560070632329222

 

అమెరికాలోని న్యూయార్క్  నగరంలో వెరోనికా అనే మహిళా రోడ్డుపై నిలబడి ఉంది. ఈలోగా ఒక్క సారిగా ఆమెపై నుంచీ దూసుకు వెళ్ళింది. ఈ ఘటనతో ఆమె కిందకి పడిపోయింది. అయితే కారు నడుపుతున్న వ్యక్తి కారు ముందుకు నడపకుండా అలాగే ఉండటంతో ఆమె ప్రాణాపాయం నుంచే బయటపడింది.కానీ ఆమె కాలు టైర్లు మధ్యలో ఇరుక్కుపోయింది. హెల్ప్ హెల్ప్ అని అరవడంతో..

 

ఒకరి తరువాత ఒకరిగా వచ్చి కారు క్రిందనే ఉన్న ఆమెని చూసి షాక్ అయ్యారు. వెంటనే కారుని పైకి లేపడానికి ప్రయత్నించారు. ఈ ఘటన చూసిన మిగిలిన వారు కారుని పైకి లేపడానికి తలోచేయి వేశారు. పెద్దగా గుమ్మిగూడిన జనం అందరూ కారుని అమాంతం పైకి లేపి ఆమెని బయటకి లాగారు. దాంతో ఆమె ప్రాణాపాయం నుంచీ బయటపడింది. ఈ ఘటన తలుచుకున్న వెరోనికా కన్నీటి పర్యంతంతో తనని రక్షించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: