అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంటేనే అందరికి గుర్తుకువచ్చేవి ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యలు, పనులు. ఈ మధ్యకాలంగా ట్రంప్ రోజుకొక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. మొన్న అభిశంసన  ప్రక్రియ విషయంలో, నిన్న WES లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతో మంది మేధావులని షాక్ కి గురిచేస్తున్నాయి. ఎప్పుడూ ఎంతో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉండే ట్రంప్ తాజాగా మరొక వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.

 

ట్రావెల్ బ్యాన్ అంశాన్ని  మళ్ళీ ట్రంప్ తెరపైకి తీసుకువచ్చారు. గతంలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొత్తలో తాను తీసుకున్న ఇదే ట్రావెల్ బ్యాన్ నిర్ణయం వివదాస్పదంగా మారింది. ఆ తరువాత దానికి  కొన్ని సవరణలు చేసి 7 దేశాల వారికి నిషేధాన్ని పరిమితం చేశారు. ఈ ఏడు దేశాలలో ముస్లిం మెజారిటీ ఉన్న దేశాలే ఎక్కువ. అయితే ఇప్పుడు ఈ ప్రయాణ నిషేధాన్ని విస్తరిస్తున్నామని, ఆఫ్రికాలోనే అత్యధిక జనాభా  కలిగిన నైజీరియతో పాటు ఏరిట్రియా, సూడాన్, టాంజానియా,కిర్కిజిస్తాన్  మరియూ మయన్మార్  దేశాలను కూడా ఈ నిషేధంలోకి చేర్చామని తెలిపారు...ఇదిలా ఉంటే...

 

ట్రావెల్ బ్యాన్ కు గురైన దేశాల వారు అమెరికాలో నివశించటానికి వీసాలను పొందలేరు కాని, ఆయా దేశాల  విద్యార్ధులకు, పర్యాటకులకు, వ్యాపార ప్రయాణాలకు మాత్రం ట్రావెల్ బ్యాన్ వర్తించదని వైట్ హౌస్ తెలిపింది. అయితే అసలు ఈ నిషేధానికి కారణం ఏంటంటే  అమెరికా నిర్దేశించిన కనీస అవసరాలు తీర్చటంలో విఫలమవ్వడమేనని అమెరికా హోంల్యాండ్ పేర్కొంది. ఈ ప్రయాణ నిషేధాన్ని ట్రంప్ మొదటిగా 2017 లో ప్రవేశ పెట్టారు. ఇప్పుడు దాన్ని విస్తరిస్తూ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: