యునైటెడ్ కింగ్డమ్ లో    భారతదేశం లోని ప్రముఖ మ్యాట్రిమోనియల్ సైట్ షాదీ.కామ్ పై కుల-ఆధారిత వివక్షను బలోపేతం చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. బ్రిటన్ లో వున్నా   భారతీయ సమాజం  యొక్క అతిపెద్ద వివాహ సైట్ అయిన ఈ వెబ్‌సైట్, షెడ్యూల్డ్ కుల వర్గాలపై వివక్షను అనుమతించిందని ఆరోపించబడింది మరియు దాని అల్గోరిథంలు దేశ సమానత్వ చట్టానికి అనుగుణంగా ఉన్నాయా అనే ప్రశ్నలను లేవనెత్తాయి.

 

 

 

 

 

 

 

ఒక నివేదిక ప్రకారం, షాదీ.కామ్ లో  ఉన్నత కుల వ్యక్తి కోసం ఏర్పాటు చేసిన ప్రొఫైల్ తక్కువ కుల వ్యక్తికీ  సంభావ్య మ్యాచ్లను ఇవ్వదు , ఒకవేళ ఉన్నత కుల వ్యక్తి  మిగతా అన్ని కులాలను చేర్చడానికి వారి ప్రాధాన్యతలను సర్దుబాటు చేస్తే ఇది మ్యాచ్ లను ఇస్తుంది.  షాదీ.కామ్ కుల-ఆధారిత పక్షపాతాన్ని  ఖండించింది. కులాల వారీగా మ్యాచ్‌లను పరిమితం చేయడం సమానత్వ చట్టానికి విరుద్ధం అని,  వినియోగదారులు తమ కులాన్ని పేర్కొనమని బలవంతం చేయడం ద్వారా, సైట్లు తమను తాము వివక్షకు గురిచేస్తున్నాయి, లేదా తెలిసి వినియోగదారుల వివక్షకు సహాయపడతాయి  అని 2015 లో బ్రిటన్  లో కుల వివక్ష యొక్క మొదటి విజయవంతమైన అభియోగానికి నాయకత్వం వహించిన న్యాయవాది క్రిస్ మిల్సోమ్  చెప్పారు.  బ్రిటన్  లో, సమానత్వ చట్టం 2010 జాతి మరియు ఇతర రక్షిత లక్షణాల ఆధారంగా వివక్షను నిరోధిస్తుంది, ఇక్కడ కులం జాతి యొక్క ఒక అంశంగా పరిగణించబడుతుంది.

 

 

 

 

 

 

బ్రిటన్  లో స్వతంత్ర కుల వ్యతిరేక చట్టం కోసం లాబీయింగ్ చేస్తున్న కుల వ్యతిరేక వివక్ష కూటమి చైర్ పర్సన్  సంతోష్ దాస్ మాట్లాడుతూ, కుల ప్రాతిపదికన కొంతమంది వినియోగదారులను వేరుచేయడానికి మరియు అనుకూలంగా ఉంచడానికి అల్గోరిథంలను ఉపయోగించడం దారుణమైనది అని, కులాన్ని  ప్రాతిపదికగా  తీసుకోవడం మంచింది కాదు అని అయన అన్నారు.   ఈ ఆరోపణలను షాదీ.కామ్ ప్రతినిధి తోసి పుచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: