మనం గత సంవత్సరం ఓ ఘటనను చూశాం.. అది ఏంటి అంటే.. ఓ భర్త భార్యకు ముద్దు పెట్టెకి వెళ్తే ఆ భార్య అతని నాలుకను కొరికేసి అతనికి మాటలకూ రాకుండా చేసిన ఘటనను చూశాం.. అదేం అంటే.. నాకు ఇష్టం లేకపోయినా ముద్దు పెట్టడానికి వచ్చాడు.. అందుకే కొరికేశా అని ఆమె చెప్పుకొచ్చింది. 

 

కానీ ఇక్కడ మాత్రం విచిత్రం. అది ఏంటి అంటే.. ఆమెకు నచ్చినట్టు ముద్దు పెట్టనందుకు ఆమె అతని నాలుకను కొరికేసినట్టు ఆమె చెప్పుకొచ్చింది. అవును.. డెట్రాయిట్లో ఓ మహిళా ఆమెకు ముద్దు పెడుతున్న వ్యక్తి నాలుకను కొరికేసింది. ఈ వింత ఘటన అమెరికాలోని డెట్రాయిట్‌లో చోటుచేసుకుంది.

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూలెట్ వెడ్జ్‌వార్త్ అనే 52 ఏళ్ళ మహిళ ఈ దారుణానికి పాల్పడింది. ముద్దు పెట్టే సమయంలో నాలుకను వద్దు అని చెప్పిన అతను వినలేదు అని.. అందుకే అతని నాలుకను కొరికినట్టు ఆ మహిళా పోలిసులకు చెప్పింది. అయితే ఆమె నాలుక మాములుగా కొరకలేదు.. ఆమె కొరికిన కోరుకుడికి అతని నాలుక తెగిపోయింది. అయితే ఆ నాలుక తెగిపోయినప్పటి అతను ప్రస్తుతం ఆరోగ్యకరంగా ఉన్నాడని.. కాకపోతే మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు అని వైద్యులు తెలిపారు. ఈ ఘటనను చూస్తే అనిపిస్తుంది.. బాబోయ్ ఇలాంటి మహిళలు కూడా ఉన్నారా? అని. 

మరింత సమాచారం తెలుసుకోండి: