ఉద్యోగం,ఉపాధి రీత్యా విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిన భారతీయ ప్రవాశీయులు ఎందరో ఉన్నారు. వారందరిలో భారతీయ ఆచార సాంప్రదాయాలు ఎప్పటికి చేరిగిపోవు. దేశానికి దూరంగా నివసిస్తూ కూడా  మాతృ భాషలను, పద్ధతులను వారి పిల్లలకు కూడా నేర్పిస్తూ, భారతీయ సంస్కృతిని ఎల్లప్పుడు కాపాడే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ తరహా ప్రయత్నానికి నిలువెత్తు నిదర్శనమే మనబడి పాటశాల...

 

ఎప్పుడు వర్క్ ప్రెషర్, బిజీ లైఫ్ తో పరుగులు తీసే  ఎన్నారైలు కొంత ఖాళి సమయం దొరికితే కాస్తంత ఎంజాయ్ చేస్తూనే, తమ పిల్లలకు ఈ పాటశాల ద్వారా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చెప్పిస్తూ , తెలుగు నేర్పిపించటంతో పాటుగా, పండుగల విశిష్టతలను కూడా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలోని డల్లాస్ నగరం లో ఉండే ఈ మనబడి పాటశాల, అక్కడి ఎన్నారైల పిల్లలతో భూకైలాస్ నాటకాన్ని వేయించింది. 

 

చిన్నారుల నాటకాన్ని తిలకించిన స్కూల్ యాజమాన్యం వారిని ఎంతగానో అభినందించింది. వారి వేషధారణ, తెలుగు పదాల ఉచ్చారణ, నాటకాన్ని చూసిన ప్రతీ  ఒక్కరిని ముగ్ధులను చేసింది. ఈ విధంగానే పిల్లలకు చిన్నతనం నుంచి రామాయణ, మహాభారతాలు, భూకైలాస్ , భగవద్గీత వంటివి తెలియచేయడం ఎంతో ముఖ్యమని, వీటి సారంశాల ద్వారా పిల్లలలో నైతిక విలువలు పెరుగుతాయని,తద్వారా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటికి బ్రతికి ఉంటాయని అన్నారు మనబడి పాటశాల యాజమాన్యం.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: