దొంగలను పట్టుకునేది మామూలుగా పోలీసులు మరి దొంగా పోలీసు గా మారితే.. ఇదే అల్లరి నరేష్ బ్లేడ్ బాబ్జీ సినిమా కథ అనుకోకండి.. నిజంగానే జరిగింది..ఒక దొంగా అదే ఒక క్రిమినల్ దాదాపుగా 20ఏళ్లు పోలీసు పాత్రను పోషించాడు..అలా ఎక్కడ చేశాడు ఎవరు అసలు ఎందుకు పోలీసులా మారాడు..ఆ కథ వెనుక అసలు కథ ఎంటో ఓ లుక్ వెద్దము రండి..

 

 

వివరాల్లోకి వెళితే..క్రిమినల్‌.. పోలీసుల కళ్లుగప్పి.. అదే శాఖలో 19 ఏళ్ల పాటు కానిస్టేబుల్‌గా సేవలందించాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన ముకేష్‌ కుమార్‌ అనే వ్యక్తి ఓ మర్డర్‌ కేసులో నిందితుడు. అతి కిరాతకంగా ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో 1997లో ఓ వ్యక్తిని ముకేష్‌ చంపేశాడు. ఆ తర్వాత పోలీసుల కంటపడలేదు ముకేష్‌. 2001లో ఉత్తరాఖండ్‌లో పోలీసు ఉద్యోగాల నియామానికి నోటిఫికేషన్‌ వెలువడింది. మెల్లగా దానిలోకి జారుకున్నాడు..

 

 

అయితే.. మర్డర్ నుండి తప్పించుకోవడానికి పోలీసు ఉద్యోగం కోసం ముకేష్‌ కూడా దరఖాస్తు చేసుకున్నాడు. మొత్తానికి ఉద్యోగం సాధించిన ముకేష్‌.. ఉత్తరాఖండ్‌లో కానిస్టేబుల్‌గా నియామకం అయ్యాడు. 2001 నుంచి ఇప్పటి వరకు ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసుగా విధులు నిర్వర్తించాడు. అయితే తాను హత్యకు పాల్పడినప్పుడు ఉన్న అడ్రస్‌ నుంచి కాకుండా వేరే అడ్రస్‌ నుంచి సర్టిఫికెట్లను సృష్టించి ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. 

 

అలా క్రిమినల్ మొత్తానికి ముకేష్‌ ఓ క్రిమినల్‌ అని ఇటీవలే బయటపడింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ముకేష్‌పై కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగం పొందిన ముకేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు... చట్టం ముందు నేరం చేసినొల్లు కలుగులో ఉన్న బయటకు రావాల్సిందే అని నిరూపించారు.. అది చట్టానికి ఉన్న పవర్ .. ఇప్పుడు అదే జైలు గోడల మద్య ఊసలు లెక్క బెడుతున్నరు...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: