అగ్ర రాజ్యం అమెరికాలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ లెక్కలు గతంలో బయటపడ్డాయో లేదో కానీ అమెరికాలో ఈ సంక్షేభం భవిష్యత్తులో అమెరికాకి ముప్పు తీసుకువస్తుందని చెప్పడంలో సందేహం లేదని అంటున్నారు నిపుణులు. తాజా అధ్యయనం ప్రకారం చూస్తే. గడిచిన దశాబ్ద కాలంలో నిరాశ్రయులు అయిన విద్యార్ధులు అధికంగా ఉన్నారట. అంతేకాదు వారందరూ రోడ్లపై, పాడు బడిన బస్ షెల్టర్ లలో తల దాచుకుంటూ చదువుకుంటున్నారని తెలుస్తోంది.

 

సుమారు 50 శాతం మంది పిల్లలు కేవలం ఇలా కాలం వెళ్ళదీస్తుంటే, సుమారు 30 శాతం మంది పిల్లలు స్నేహితుల ఇళ్ళలో, లేదా తెలిసిన వారి వద్ద ఉంటూ చదువుకుంటున్నారట. ఈ విషయాన్ని వెల్లడించింది ఎవరో కాదు నేషనల్ హోమ్ ఫర్ హోమ్ లెస్ ఎడుకేషన్ సంస్థ.  అయితే  ఈ పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం అమెరికాలో నానాటికి పెరుగుతున్న ఉద్యోగ అభద్రతా, భరించలేని గృహ నిర్మాణ వ్యయం అన్నిటికంటే ముఖ్యంగా...

 

గృహ హింసల కారణంగా విద్యార్ధి దశలోనే పిల్లలు రోడ్లపై పడుతున్నారట. ఒక స్థిరమైన చిరునామా లేకుండా ఇలా విద్యార్ధులు రోడ్లపై గడపడం వలన వారి మానసిక స్థితి ఆందోళన కరంగా మారుతుందని, తద్వారా వారి భవిష్యత్తుపై ఈ పరిస్థితులు తీవ్రమైన ప్రభావం చూపుతాయని, ఇది అమెరికా భవిష్యత్తుకే ముప్పు వాటిల్లేలా మారుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 2004-2005 పరిస్థితుల లెక్కల ప్రకారం చూస్తే 6,80000 లక్షల మంది విద్యార్ధులు నిరాశ్రయులు అయ్యారని  నేషనల్ హోమ్ ఫర్ హోమ్ లెస్ ఎడుకేషన్ సంస్థ ప్రతినిధి క్లిఫోర్డ్ ఆందోళన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: