ఎంతో మంది భారతీయులు సొంత వారిని వదిలి పొరుగు దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తుంటారు. ఎందుకంటే  వారి వారి ప్రాంతాలలో కంటే కూడా అక్కడ ఎంతో కొంత డబ్బు ఎక్కువగా వస్తుందనే ఉద్దేశ్యంతో. దేశం కాని దేశంలో పొట్టగట్టుకొని మరీ రూపాయి రూపాయి దాచి అప్పులు తీర్చుకుంటూ  తమ వారికి ఏ కష్టం కలగకుండా చూసుకుంటారు. విదేశాలలో ఉంటూ సంపాదిస్తున్నారు అనుకుంటారు అందరూ , కాని రూపాయి ఖర్చు పెట్టాలన్నఒకటికి , వంద సార్లు ఆలోచన చేస్తారు. సొంత వారిని చూడాలని  ఉన్నా చార్జీల ఖర్చులు భరించలేక ఆ ఆశను కూడా వదులుకుంటారు..అయితే

 

ఇలాంటి వారి కోసమే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థ, గల్ఫ్ లో పనిచేసుకునే భారతీయులకు బంపర్  ఆఫర్ ను ఇస్తోంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా టికెట్ ధరలను తగ్గిస్తూ ఫ్లాష్ సేల్ ను ప్రారంభించింది. షార్జా నుంచి ముంబాయ్ వరకు ప్రయాణించేందుకు కేవలం 269 దిర్హామ్స్ (సుమారు రూ. 5200) ను టికెట్ ధరగా నిర్ణయించింది. అంతేకాదు  దుబాయ్-ముంబాయి టికెట్ ధర 289 దిర్హామ్స్ (సుమారు రూ.5,600)గా వెల్లడించింది.

 

అంతేకాదు దుబాయి/షార్జా – కొజికోడ్ టికెట్ ధర 279 (సుమారు రూ.5,400) దిర్హామ్స్ గా ప్రకటించింది. అయితే ఈ ఫ్లాష్ సేల్ ఫిబ్రవరి 6-10   మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఈ తేదీల మద్య టికెట్ బుక్ చేసుకున్నవారు  ఫిబ్రవరి 6- అక్టోబర్ 24 మధ్య కాలంలో ప్రయాణం చేయవచ్చని  ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థ ఈ సేల్ కు సంబంధించిన ప్రకటనలో తెలిపింది. మరి ఇంకేం టిక్కెట్టు ధరలకి భయపడి సొంత ఊళ్ళకి వెళ్ళలేని భారతీయులు త్వరగా టిక్కెట్ బుక్ చేసేసుకోండి....

 

మరింత సమాచారం తెలుసుకోండి: