అమెరికా ఇది ఎంతో మందికి కలల ప్రపంచంగా కనబడుతుంది. అక్కడ జాబు చేయాలని, ఉన్నత విద్యని అభ్యసించాలని, పౌరసాత్వాన్ని సంపాదించాలని ఎంతో భారతీయలు కలలు కంటూ ఉంటారు. ఈ క్రమంలో కొంతమంది నైపుణ్య సామర్ధ్యాలతో కలను సహకారం చేసుకుంటే, కొంత మంది మాత్రం అడ్డదారులు తొక్కుతుంటారు. వారు అనుకున్నది నెరవేరాడానికి ఎంత నీచానికైనా దిగుతారు. ఈ కోవకు చెందిన వ్యక్తే పంజాబ్ కు చెందిన నవదీప్ సింగ్.... అసలు కథ ఏంటంటే..

 

పంజాబ్ లోని లుథియానాకు చెందిన నవదీప్ సింగ్ కు అమెరికాలో స్థిరపడాలని కోరిక భలంగా ఉండేది. అదే అతని కొంప ముంచింది. అమెరికాలో స్థిరపడిన గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిన దేవిందర్ కౌర్ ను పెళ్లి చేసుకున్నాడు. దాంతో  నవదీప్ సింగ్ కి కూడా గ్రీన్ కార్డు వచ్చింది.  అమెరికాలో స్థిరపడాలన్న తన  కల కూడా నెరవేరింది. అయితే పెళ్ళైన కొంతకాలం తరువాత నవదీప్ తన భార్యతో ఉండకుండా అక్కడే నివసిస్తున్న అతని మావయ్య అమర్జిత్ సింగ్ దగ్గర ఉండటం మొదలు పెట్టాడు..ఈ క్రమంలో అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి అతడి గురించి ఆరాతీయగా..

 

నవదీప్ కు ఇంతకు ముందే పెళ్లి అయ్యిందని అమెరికాలో స్థిరపడాలన్న ఒక్క కోరికతోనే తనని పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుంది. ఈ విషయమై దేవిందర్ పంజాబ్ పోలీసులను సంప్రదించింది. అతని మావయ్య అమర్జిత్ సింగ్ మాయ మాటల వలనే ఈ పెళ్లి చేసుకున్న విషయం వివరించింది. ఈ కారణంగానే  నవదీప్, అతని భార్య మజీందర్ సింగ్, అతని మావయ్య అమర్జిత్ సింగ్ లపై పోలీసులు కొన్ని సెక్షన్ల తో కేసలు నమోదు చేశారు. అయితే నవదీప్, అమర్జిత్ లపై అమెరికా పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేయబోతున్నారని పోలీసులు తెలిపారు. ఈ నేపధ్యంలోనీ  పంజాబ్ లోనే ఉండటంతో త్వరలో ఆమెను కూడా అరెస్ట్ చేయనున్నట్టు పేర్కొన్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: