యూఏఈ లోని కొన్ని ప్రధాన బ్యాంకులు భారతీయుల పేరు చెపితే బెంబేలెత్తిపోతున్నాయట.  ఈ బ్యాంకులకు ఎవరైనా నా లోన్ ల కోసం వెళ్లినా, ఖాతాలు తెరవాలని చెప్పినా మీరు భారతీయులా అంటూ  ప్రశ్నలు సందిస్తున్నాయట.. ఒకవేళ భారతీయులైతే లోన్లు ఇవ్వలేమని చేతులెత్తుస్తున్నాయని అంటున్నారు కొందరు భారతీయులు. ఈ పరిస్థితులు రావడానికి గల కారణం వింటే వారు అన్న మాటల్లో తప్పులేదని అనక తప్పదు. ఎందుకంటే  

 

యూఏఈ లో బాగా బ్యాంకులు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎంతో మంది భారతీయులు లోన్లు తీసుకున్నారు. వారి ఆర్ధిక అవసరరాలకో లేదా బిజినెస్ లలోకి పెట్టుబడులకో ఎదో ఒక కారణంగా సదరు బ్యాంకులు లోన్లు ఇచ్చాయి. క్రెడిట్ కార్డుల బిల్లులు అయితే లెక్కలేదు. ఇలా భారతీయులకి అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఇప్పుడు నష్టాల బాటలో పయనిస్తున్నాయట. ఇప్పటి వరకూ భారతీయులకి ఇచ్చిన అప్పుల లెక్కలు వాటి వడ్డీలు లెక్కలు వేస్తే సుమారు 50వేల కోట్లకి పైగా అప్పులలో యూఏఈ బ్యాకులు కూరుకుపోయాయని తెలుస్తోంది.

 

ఇలా అప్పులు తీసుకుని ఎగ్గొట్టి సొంత ప్రాంతాలకి వెళ్లిపోయారట భారతీయులు.భాతీయులు అందరిలో ముఖ్యంగా అప్పులు ఎగ్గొట్టిన వారిలో కేరళా వాసులే అధికంగా ఉన్నారని సదరు బ్యాంకులు గోడు వెళ్ళబోసుకుంటున్నాయి. దాంతో ఇప్పటి వరకూ నీరిక్షించిన బ్యాంకులు అప్పు ఎగవేతదారులపై చర్యలు చేపట్టడానికి సిద్దమయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వంతో మాట్లాడిన బ్యాంకులు, క్రిమినల్ చర్యలు తీసుకునేలా కోర్టుల ఆశ్రయించాలని ఆలోచన చేస్తున్నాయట. ఏది ఏమైనా కొందరు భారతీయులు భారత్ లోని బ్యాంకులకే కాదు..ఇతర దేశాలో ఉన్న బడా బ్యాంకులకి కూడా పంగనామాలు పడుతున్నారు

 

మరింత సమాచారం తెలుసుకోండి: