అమెరికాలో భారత సంతతి యువతి అత్యంత అరుదైన గౌరవం దక్కించుకుంది. 23 ఏళ్ళ ఇండో అమెరికన్ అయిన శ్రీ సైనీ గతంలో మిస్ వరల్డ్ అమెరికా వాషింగ్టన్ గా కూడా అవార్డ్ అందుకుంది. అయితే తాజాగా ఆమె ప్రపంచ శాంతి అవార్డ్ దక్కించుకున్నారు. ఈ అవార్డ్ పై  స్పందించిన ఆమె ఇంతటి గొప్ప అవార్డ్ అందుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అయితే ముందు నుంచీ సేవా కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొనే సైనీ గతంలో స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేపట్టేవారు..

 

అమెరికా మిస్ వరల్డ్ గా, ప్రపంచ శాతం అవార్డ్ అందుకున్నా ఇవన్నీ తన తల్లి తండ్రులు ఇచ్చిన ప్రోశ్చాహం వలనేనని తెలిపారు. తన తల్లి తండ్రులు లేక పొతే అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చేది కాదని ఆమె తెలిపారు. శ్రీ సైనీ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లో  పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బిజినెస్ లలో డబుల్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. అంతేకాదు గతంలో ఎన్నో పోటీలలో పాల్గొని విజయాలు సాధించారు.

 

భారత్ లో పంజాబ్ కి చెందిన సైనీకి  ఏడేళ్ళ వయసు ఉన్నప్పుడే తల్లి తండ్రులు అమెరికా వచ్చేశారు. చిన్నతనం నుంచీ వివక్షని ఎదుర్కున్న సైనీ ఆ తరువాత ఎన్నో సేవా కార్యక్రమాల రూప కల్పనలో, సమాజంలో ఉండే వివక్షని ఎత్తి చూపడంలో ముందు ఉండే వారు. ఈమే రచయత్రి కూడా.అంతేకాదు ఆమె పత్రికలకి ఇప్పటి వరకూ సుమారు 400 వ్యాసాలు రాశారు.

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: