అమెరికాలో ఉంటున్న భారతీయులు భారత్ కి వచ్చినప్పుడల్లా భారత్ ని సందర్శించడంతో పాటుగా పలురకాల సేవలు అందించడానికి ఓసిఐ ( ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) కార్డ్ ఉపయోగపడుతుంది. ఈ కార్డుని 20 ఏళ్ళ నుంచీ 50 ఏళ్ళ మధ్య వయసు వారు తమ తమ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్న ప్రతీ సారీ రద్దు చేసిన పాత పాస్ పోర్ట్ తీసుకురావాలని భారత్ విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే.

 

ఈ క్రమంలోనే ఈ కార్డ్ ని మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి గడువుని జూన్ 30 వరకూ ఇచ్చారు. అయితే అమెరికాలో ఓసిఐ కార్డు ఉన్న భారత సంతతి పౌరులు ఎదుర్కుంటున్న కొన్ని ఇబ్బందుల వలన ఈ గడువు తేదీని డిసెంబర్ వరకూ పోడించాలని భారత ప్రభుత్వాన్ని ఇండో అమెరికన్ సామాజిక కార్యకర్త అయిన ప్రేమ భండారి కోరారు.

 

దాంతో అమెరికాలో ఉంటున్న భారతీయ అమెరికన్లు అందరూ బండారి చెప్పిన విధానికి మద్దతు ఇస్తూ కార్డు మరలా రెన్యువల్ చేయడానికి భారత్ ఇచ్చిన గడుపు సరిపోదని మరింత సమయం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే...దీనిపై ప్రభుత్వం నుంచీ అవగాహన ప్రచారం కలిపించాల్సి ఉందని అందువల్ల కార్డు పొడిగింపు తేదీని డిసెంబర్ 31 వరకూ ఇవ్వాలని కోరారు...దాంతో ఈ విషయంపై ఇండియన్ ఎంబసీ వివరణ ఇచ్చింది. ఈ కార్డు రెన్యువల్ చేయకపోవడంతో చాలా మందిని ప్రయాణ సమయంలో బోర్డింగ్ సమయంలో విమానయాన సంస్థలు నిలిపివేస్తున్నాయని తెలిపారు. మరి ఎన్నారైల విజ్ఞప్తి పై భారత్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే...

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: