భారతదేశం నుంచి  ఎంతో మంది భారతీయులు విదేశాలకి వెళ్లి అక్కడ స్థిరపడి ఆర్ధికంగా ఉన్నతమైన స్థానాలని అధిరోహించారు. అక్కడ వివిధ రంగాలలో కీలక పాత్ర పోషిస్తూ భారతీయుల యొక్క కీర్తి ప్రతిష్టలని పరాయిదేశంలో మరింత ఇనుమడింప చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం అగ్ర రాజ్యం అమెరికా వంటి దేశంలో అధికంగా కనిపిస్తుంది. కొన్నేళ్ళ క్రిందటే భారతీయులు అధిక సంఖ్యలో అమెరికాలో స్థిరపడి అక్కడి పౌరులుగా గుర్తించబడటమే కాకుండా అమెరికాలోని అన్ని రంగాలలో తమదైన ముద్ర వేశారు..ఈ కోవకి చెందినా వారే శ్రీనివాసన్

 

భారత్ లో దక్షినాది రాష్ట్రానికి చెందిన శ్రీనివాసన్ ఎన్నో ఏళ్ళ క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు. తాజాగా ఈయన అత్యంత శక్తివంతమైన అమెరికా ఫెడరల్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులు అయ్యి ప్రమాణ స్వీకారం కూడా చేపట్టారు. అయితే ఈ పదవి చేపట్టిన దక్షిణ ఆసియా  వ్యక్తిగా శ్రీనివాసన్ రికార్డ్ క్రియేట్ చేశారు. భారత్ లో హైకోర్టులు ఎలా ఉంటాయో అమెరికాలో సర్క్యూట్ కోర్టులు ఉంటాయి. సుప్రీం కోర్టు తరువాత అత్యంత శక్తివంతమైనవిగా వీటిని పరిగణిస్తారు.

 

 

ఈ కోర్టుల పరిధిలో కొన్ని ప్రాంతాలు, నగరాలు , లేదా కొన్ని రాష్ట్రాలు ఉంటాయి. శ్రీనివాసన్ ఈ యూఎస్ డిసీ సర్క్యూట్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక అయ్యారు. అయితే శ్రీనివాసన్ కి అమెరికా న్యావ్యవస్థలో మంచి పేరు ఉంది. అంతేకాదు మంచి సామాజిక వేత్తగా కూడా శ్రీనివాస్ పేరు తెచ్చుకున్నారు. శ్రీనివాసన్ ఇంతటి గొప్ప పదవిని అలకరించినందుకు గాను ఇండో అమెరికన్స్ అందరూ అభినందనలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: