అగ్ర రాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ వ్యవహార శైలి గురించి అందరికి తెలిసిందే. అనుకున్నది చేసేవరకూ నిద్రపోడు, ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. తన కోటరీలో ఎవరు తనకి నచ్చకపోయినా, తన మాటకి ఎదురు ఎవరు చెప్పినా సరే క్రమశిక్షణా చర్యలు వెనువెంటనే తీసుకుంటాడు. ట్రంప్ తీసుకునే చర్యలని తన భార్య సైతం ఒకానొక సందర్భంలో వ్యతిరేకించిందంటే అర్థం చేసుకోవచ్చు ట్రంప్ శైలి. అయితే ఇలాంటి ట్రంప్ మెప్పు పొందటానికి ట్రంప్ కోటరీ శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది..కానీ

Image result for bussa krishna

కోట్లాది మందిలో ఒకే ఒక్క భారతీయుడు మాత్రం ట్రంప్ మనసు గెలుచుకున్నాడు. అంతేకాదు ట్రంప్ స్వయంగా అతడి గురించి  సోషల్ మీడియాలో కోట్లాది మంది భారతీయులలో నువ్వు నాకు ఎంతో ప్రత్యేకం నిన్ను త్వరలో కలుస్తాను అంటూ ప్రకటించారు. ఇంతకీ ఆ భారతీయుడు ఎవరు..ఎక్కడ ఉంటాడు..ట్రంప్ అంతగా మెచ్చుకున్న , మనసు గెలుచుకున్న పని ఏమి చేశాడు అనే విషయాలలోకి వెళ్తే..

Image result for bussa krishna

ట్రంప్ ని అంతగా మెప్పించిన వ్యక్తి ఎవరో కాదు తెలంగాణా రాష్ట్రంలోని జనగామ జిల్లాకి చెందిన బచ్చన్న పేటలోని కొన్నే గ్రామంలో ఉండే కృష్ణ. అందరూ అతడిని క్రిష్ అంటారు. రెండేళ్ళుగా ట్రంప్ వీరాభిమానిగా ఉన్న క్రిష్. ట్రంప్ కి ఏకంగా గుడి కట్టిమరీ పూజలు చేస్తున్నాడు. ధూప, దీప నైవేద్యాలతో పాటు పూజలు చేస్తున్న క్రిష్ గురించి ట్రంప్ కి కూడా తెలుసు. తనని ఎంతగానో అభిమానిస్తున్న క్రిష్ గురించి తెలుసుకున్న ట్రంప్ కూడా తనని కలవడానికి ఆత్రుతగా ఉన్నాను అంటూ గతంలో ప్రకటించారు

Image result for bussa krishna

తాజాగా ట్రంప్ ఇండియా వస్తున్న సందర్భంగా మళ్ళీ వార్తల్లో నిలిచాడు క్రిష్. ట్రంప్ కి గుడి కట్టడానికి కారణం ఏమిటని అడుగగా ట్రంప్ ముక్కు సూటి తనం..ఆయన వ్యవహార శైలి అతడిని ఎంతో ఆకర్షించిందట. అందుకే ట్రంప్ కి గుడి కట్టాను అంటున్నాడు.సుమారు 7 అడుగులతో కట్టిన ఈ గుడిలో నిత్యం పూజలు చేస్తూ ట్రంప్ ని కలవాలని పరితపిస్తూ ఉంటాడు. ప్రసిద్ది చెందిన పుణ్య నదుల నీళ్ళు తెచ్చి ట్రంప్ కి అభిషేకాలు కూడా చేస్తూ ఉంటాడు. ట్రంప్ ని ఒక్క సారైనా కలుసుకుని మాట్లాడాలనేది తన కోరిక అంటాడు క్రిష్. అయితే  గతంలో క్రిష్ గురించి తెలిసిన ఇండియా వచ్చినపుడు కలుస్తానని మాట ఇచ్చిన నేపధ్యంలో తాజా ట్రంప్ పర్యటనపై ఆశలు పెట్టుకున్నాడు క్రిష్. మరి ఇండియా భక్తుడి కోరిక ట్రంప్ నెరవేర్చుతాడో లేదో చూడాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: