ఒకప్పటి రోజుల్లో మహిళలకు కొన్ని రంగాల్లో ఎక్కువ ప్రాథాన్యతను ఇచ్చేవారు కాదు. కాని రోజులు మారాయి, రాను రాను మహిళల బలం పెరుగుతోంది. ఏ రంగంలోనైన మాకు మేమే సాటి అంటూ మహిళలు ముందుకు వెళుతున్నారు. రాజకీయాలతో సహా అన్ని రంగాలలో వారి ప్రతిభకు పట్టం కడుతున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన ఒక మహిళకు లండన్ లో కీలక పదవి దక్కింది..

IHG

సుయెల్ల బ్రావర్మన్ (39)కు జాన్సన్  మంత్రి వర్గంలో చోటు దక్కింది. మంత్రి వర్గ విస్తరణలో భాగంగా యూకే అటార్నీ జనరల్ గా భారత సంతతికి చెందిన సుయెల్లను నిమమిస్తూ ఉత్తర్వులు జారి చేశారు. సోమవారం లండన్ రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ లో జరిగిన  ఓ ప్రత్యేక కార్యక్రమంలో సుయెల్ల తన బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, ఈ అరుదైన గౌరవం దక్కడం చాల సంతోషంగా ఉందని, ఎల్లప్పుడూ న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే,

IHG

కేంబ్రిడ్జ్ విస్వవిదాలయం నుంచి లా పూర్తి చేసిన సుయెల్ల, అండర్ గ్రాడ్యుయేషన్ సమయంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కన్జర్వేటివే చైర్మెన్ గా పని చేశారు. 2005 నుంచి 2015 వరకు లా ప్రాక్టీస్ చేసి, 2015 నుంచి ఆగ్నేయ ఇంగ్లాండ్ లోని ఫేరేహామ్ కు మెంబెర్ ఆఫ్ పార్లమెంట్ గా కొనసాగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: