ఏదైనా ఉచితంగా ఇస్తే ఎవరైనా సంతోషపడతారు, కృతజ్ఞతలు తెలుపుతారు. అంతే కాని, ఎందుకు ఉచితంగా ఇచ్చావంటూ ఎవరైనా చితకబాదుతారా..??ఇలాంటి ఓ వింత ఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. అడిగిన వస్తువు ఉచితంగా ఇచ్చినందుకు కస్టమర్ అక్కడి మహిళా ఉదోగి పై దాడికి పాల్పడ్డాడు..ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది....వివరాలలోకి వెళితే..

IHG

అమెరికాలోని టెన్సేస్సీలో మెక్ డోనాల్డ్ రెస్టారెంట్ కు వెళ్ళిన ఓ కస్టమర్ క్యాషియర్ దగ్గరకు వెళ్లి మంచినీరు కావాలని అడిగాడు. అక్కడ పని చేసే మహిళా ఉద్యోగిని 32 సెంట్లు విలువ చేసే మంచి నీటిని ఇచ్చింది. బిల్ వేస్తున్న సమయంలో సిస్టమ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ రావడంతో, డబ్బులు వద్దని చెప్పింది. దాంతో కస్టమర్ కు కోపం వచ్చి, ఆ కోపంలో మంచినీటిని ఉచితంగా ఇస్తావా అంటూ విచక్షణ రహితంగా ఆమెపై దాడి చేశాడు..ఈ క్రమంలోనే..

 

IHG

 

జేబు లోంచి 100 డాలర్లు తీసీ, ఆమెను తీసుకోమంటూ బెదిరించాడు. డబ్బు తీసుకోడానికి నిరాకరించడంతో ఆమెను కింద పడేసి దాడి చేశాడు. ఆమెను కాపాడటానికి వచ్చిన సహా ఉదోగిని మీద కూడా దాడికి పాల్పడ్డాడు. ఇంతలో హోటల్ యాజమాన్యం అప్రమత్తం అవడంతో నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. ఇదిలా ఉంటే, ఆ నిందితుడు డ్రగ్స్ మత్తులో ఉండడం వల్ల ఇలా చేసినట్టు తెలుస్తోంది.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: