అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఫుల్ సక్సెస్ అయ్యింది. మోడీ ఇచ్చిన ఆతిధ్యానికి ఫిదా అయిపోయిన ట్రంప్ మోడీ నాకు మంచి మిత్రుడు అంటూ పొగడ్తలలో ముంచెత్తాడు దీనికి వేరే కారణం ఉన్నా భారత్ ట్రంప్ కి అత్యంత సన్నిహితమైన దేశంగా ముద్ర పడిపోయింది. త్వరలో అమెరికాలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఎన్నారైల ఓట్లు కొన్ని స్థానాలలో అత్యంత కీలకం కానున్న నేపధ్యంలో ట్రంప్ భారత పర్యటనపై అమెరికాలోని ఎన్నారై లు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే

IHG

ట్రంప్ భారతీయులకి ఓ గుడ్ న్యూస్ తెలుపనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. భారత పర్యటనలో ట్రంప్ మోడీ ల ఏకాంత చర్చలలో మోడీ వీసాల విషయం ప్రస్తావించినట్టుగా. కేవలం హెచ్ 1బీ వీసా హెచ్ -4 వీసాల ప్రస్తావన మాత్రమే కాకుండా అక్కడ భారతీయులు ఎదుర్కుంటున్న ఇబ్బందులపై కూడా మోడీ ట్రంప్ తో మాట్లాడరాని, అందుకు మోడీ కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. ఈ మాటలకి బలం చేకూర్చేలా మోడీ మీడియాతో మాట్లాడుతూ..

IHG

రెండు దేశాల మధ్య మంచి సంభంధాలు ఉండటానికి ముఖ్య కారణం అక్కడ ఉంటున్న భారత సంతతికి చెందిన వాళ్ళు, భారతీయ టెకీ, విద్యార్ధులు కారణమని, అమెరికా ఆర్ధిక వ్యవస్థ అత్యంత బలమైనదిగా మారడానికి కారణం భారతీయులేనని, వారి సేవలని గుర్తించాలని ట్రంప్ ని కోరినట్టుగా మోడీ తెలిపారు. వారికి వీసాల తో పాటుగా సామాజిక భద్రత ఇవ్వాలని కోరినట్టుగా మోడీ ప్రకటించారు. మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో భారతీయుల మద్దతు మరింతగా ఉంటుందని ట్రంప్ కి మోడీ తెలిపినట్టుగా మీడియా ముందు వెల్లడించారు. ఇదిలాఉంటే భవిష్యత్తులో రానున్న ఎన్నికల నేపధ్యంలో ట్రంప్ భారతీయులకి సంభందించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: