జంతువులన్నింటిలో విశ్వాసం గల జంతువు ఏది అనే ప్రశ్నకు మొదట కుక్క పేరు వినిపిస్తుంది. కానీ కొందరు మాత్రం కుక్కలు విశ్వాసంగా ఉంటాయి కాని వాటికి ఆలోచన, జ్ఞానం, తెలివితేటలు లేవని నమ్ముతారు. కానీ కుక్కలకు ఆలోచన, జ్ఞానం, తెలివితేటలు అన్నీ ఉంటాయి. ఈ విషయాన్ని ఇప్పటివరకు నమ్మనివారు కూడా ఈ ఘటన గురించి తెలిస్తే నిజమేనని నమ్ముతారు.

 

పూర్తి వివరాలలోకి వెళితే... అమెరికాలోని టెక్సాస్ లోని ఒక పోలీస్ స్టేషన్ లో ఒక కుక్క తప్పిపోయాయని వచ్చి ఫిర్యాదు చేసింది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఫిబ్రవరి 11వ తేదీ రాత్రి జర్మన్ షెపర్డ్ జాతి కుక్క పోలీస్ స్టేషన్ కు వచ్చి తాను తప్పిపోయానని తనను యజమాని దగ్గరకు చేర్చాలని సైగల ద్వారా తెలియజేసింది. పోలీసులు కుక్క ప్రవర్తనకు ఆశ్చర్యపోయి ఆ కుక్కను రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉంచుకున్నారు.

 

ఆ తరువాత సోషల్ మీడియాలో కుక్కకు సంబంధించిన ఫోటోలను అప్ లోడ్ చేసి పోలీసులు కుక్క యజమానికి కుక్కను అప్పగించారు. పోలీసులు సోషల్ మీడియాలో " యాదృచ్చికంగా గత రాత్రి మా స్టేషన్ లోకి ఒక తెలివి గల కుక్క వచ్చింది. సరదాగా మాతో రాత్రంతా గడిపింది. మాపై కుక్క ఎంతో ప్రేమను చూపించింది. ఆ కుక్కను యజమాని దగ్గరకు చేర్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది" అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: