అమెరికాలో స్థిరపడాలని ఎంతో మంది వివిధ దేశాలనుంచీ అమెరికాకి వలస వెళ్తూ ఉంటారు. ఇలా వలసలు వెళ్ళే వారిలో అత్యధికులు భారతీయులే.  అయితే ఈ వలసలపై ఉక్కుపాదం మోపుతూ ట్రంప్ హయాంలో వీసాల జారీపై తీసుకున్న కటినమైన నిర్ణయాలు దాదాపు వలసలకి అడ్డుకట్ట వేయగలిగాయి. అయితే అమెరికాలో శాశ్వత నివాసం పొందటానికి ఏళ్ళ తరబడి హెచ్ -1 బీ వీసా ద్వారా వేచి ఉండేదానికంటే కూడా...

IHG

ఈబీ-5 వీసా పొందగలిగితే కేవలం 3 లేదా 4 ఏళ్ళలోగానే గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉంది.  అమెరికాలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకోసం అమెరికా ప్రభుత్వం 1993 లో ఈ ఈబీ-5 వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా కనీసం అమెరికాలో 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా 5 లక్షల పెట్టుబడి పెట్టె విదేశీయులకి గ్రీన్ కార్డ్ లు అందించేవారు..అయితే

IHG

ప్రస్తుతం అమెరికాకి  ఈబీ-5 వీసాపై  వెళ్ళే వారికి షాకింగ్ న్యూస్ చెప్పననుందట. త్వరలో ఈ వీసాపై ఇమ్మిగ్రేషన్ చార్జీలు క్రింద 50 వేల డాలర్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ విధానం వలన అమెరికాలో పెట్టుబడులు పెట్టె వారికి అడ్డంకులు సృష్టించినట్టు ఉందని, ముఖ్యంగా ఈ విధానం వలన భారతీయులు, చైనీయ సంతతి ప్రజలు ఇబ్బందుల ఎన్నో అవస్థలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది..ఈ మేరకు అమెరికన్ బజార్  గ్లోబల్ చైర్మెన్ తెలిపారు....

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: