ఎంత జాగ్రత్త పడిన సరే.. దొంగతలు జరుగుతూనే ఉంటాయి. సిసి కెమెరాలు పెట్టిన ముఖం కనిపించకుండా మిగితా పని అంత కానిచ్చేస్తున్నారు నేటి తరం దొంగలు. ఇక అలాంటి దొంగలే కాలిఫోర్నియాలో కూడా ఉన్నారు. రాత్రి సమయాల్లో ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాల పార్ట్‌లను దొంగలు దోచుకెళ్తున్నారు.  

 

ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా? నిజమండీ.. కార్లలో ఉండే కాస్టలీ భాగాలను దొంగలించేస్తున్నారు. దీంతో అక్కడ వారు పెద్ద పెద్ద లైట్లు ఏర్పాటు చేసిన ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఈ దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ఓ మహిళా ఆలోచించిన ఉపాయం ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

అంత గొప్ప పని ఏంటి? అని అనుకుంటున్నారా? అదేనండి.. బాగా ప్రెషర్‌తో కూడుకున్న మోషన్ యాక్టివేటెడ్ స్ప్రింక్లర్‌ను తన కారుపై ఏర్పాటుచేసింది. ఎవరైనా తన కారు దగ్గరకు చేరుకున్న వెంటనే.. ఆ స్ప్రింక్లర్ నుంచి వేగంగా నీళ్లు వస్తాయి... అయితే పాపం ఆ విషయం దొంగకు తెలియక ఇబ్బందులపాలయ్యాడు.. 

 

ఎప్పటిలగే కారు వద్దకు సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన ఆ వ్యక్తికి స్ప్రింక్లర్ నుంచి నీళ్లు వచ్చి అతనిపై పడ్డాయి. అంతే వెంటనే ఆ దొంగ వెనుదిరిగాడు. అయితే ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా ఐడియా అద్భుతం కదా!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: