అమెరికాలో ఉన్న తెలుగు వారి కోసం ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్క ఎన్నారైకి ఉపయోగకరమైన ఈ కార్యక్రమం ఎంతోమంది ఎన్నారైల సందేహాలను నివృత్తి చేస్తుందని తెలిపింది. అమెరికాలో వీలునామా, వారసత్వ ఆస్తుల ప్రణాళిక అంశాలపై నిర్వహించిన అవగాహన సదస్సు ఎంతోమంది విశేషంగా ఆకట్టుకుంది.

IHG

అమెరికాలోని ప్రముఖ న్యాయ నిపుణులు రచయిత అలెన్  ఎంతో విలువైన సూచనలు సలహాలు అందించారు. అమెరికాలోని ఏర్పాటుచేసిన ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు  700 మంది తెలుగువారు  వెబ్ నార్ ద్వారా ఎన్నో కీలకమైన, న్యాయపరమైన సూచనలు సలహాలు పొందారు.

IHG

అమెరికాలో ఎన్నారైలకు ఎటువంటి న్యాయపరమైన హక్కులు ఉన్నాయి, మరణించిన తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకు వారసత్వంగా సంక్రమించే లా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిదండ్రులు ఇద్దరూ మరణిస్తే పిల్లలకు సంరక్షకుడు ఎవరు,   ఊహించని పరిణామాలు జరిగితే న్యాయ పరంగా వచ్చే చిక్కులు  ఏమిటి అనే విషయాలపై చాలా స్పష్టంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వందలాది మంది తెలుగువారు నాట్స్  ఏర్పాటుచేసిన న్యాయ సలహా కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నాట్స్  చేపట్టాలని కోరారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: