ఇప్పుడు కరోనా వైరస్ కేవలం చైనాను కాదు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకూ చైనా, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా వంటి దేశాల్లో మరణాలు నమోదు కాగా.. ఇప్పుడు ఈ కరోనా అమెరికాలోనూ హడలెత్తిస్తోంది. అక్కడ కూడా మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

 

 

చైనాతో మొదలైన కోవిడ్ -19 వైరస్ ఇప్పుడు అమెరికాకు కూడా పాకింది. అమెరికాలో ఈ వైరస్ కారణంగా ఆరుగురు ఇంతవరకు మరణించారని తెలుస్తోంది. వీరంతా వాషింగ్టన్ రాష్ట్రానికి చెందినవారే. అమెరికాలో మొత్తం 91 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ మేరకు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపారు.

 

 

అమెరికాలో కరోనా వైరస్ వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికాలోనే 43 మందికి సోకింది. మరో 48 మంది విదేశాల నుంచి తిరిగొచ్చిన వారని మైక్ పెన్స్ తెలిపారు. చైనాలోనే ఇప్పటివరకు మూడువేల మంది వరకు మరణించారని లెక్కలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఇరాన్ లో ఎక్కువ మందికి ఈ వైరస్ సోకింది. మొత్తం మీద ఈ కరోనా ఏదో ప్రపంచం కొంప ముంచేలాగానే ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: