అగ్ర రాజ్యం అమెరికా లో త్వరలో జరగనున్న ఎన్నికలు సర్వత్రా ఉత్ఖంటని రేపుతున్నాయి. ఇప్పటికే డెమోక్రటిక్, రిపబ్లికన్ ఇరు పార్టీల మధ్య ప్రచార హోరు ఊపందుకుంది. ఈ క్రమంలోనే అమెరికాలో ప్రైమరీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే తాజాగా వెలువడిన వివిధ రాష్ట్రాల హౌస్ ఆఫ్ రిప్రజంటేషన్ ప్రైమరీస్ ఫలితాలలో పలువురు భారత సంతతి వ్యక్తులు మన సత్తా చాటారు.

IHG

ప్రస్తుతం వెలువడుతున్న ఈ ఫలితాలలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్ ముందున్నారు. అయితే పలు ప్రాంతాల నుంచీ భారతీయులు వరుస విజయాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ కోవలోనే టెక్సాస్ 22 వ కాంగ్రేష్నల్ డిస్ట్రిక్ట్ నుంచీ భారత సంతతికి చెందిన ప్రీస్టన్ కులకర్ణి సైతం ఉన్నారు. కులకర్ణి తనతో పోఆటు పోటీ పడిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధులు డెర్రిక్ రీడ్, అటార్నీ న్యాన్జా డేవిస్ మూర్ ఇద్దరినీ వెనక్కి నెట్టి మరీ కులకర్ణి దూసుకుపోయారు.

IHG

డెర్రిక్ రీడ్ కి 24.7 శాతం ఓట్లు పోలవగా, డేవిస్ మూర్ కి 14.5 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక కులకర్ణి కి దాదాపు 53.1 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ సందర్భంగా కులకర్ణి మాట్లాడుతూ తనని గెలిపించిన ప్రవాస భారతీయులకి అలాగే స్థానికంగా ఉన్న అమెరికన్స్ అందరికి కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారం వలనే తనకి ఈ విజయం కలిగిందని తెలిపారు. కులకర్ణి కుటుంభం 1969 లోనే భారత్ నుంచీ అమెరికా వెళ్లి స్థిరపడిపోయింది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: