ప్రపంచాన్ని ఏదైనా వణికిస్తోంది అంటే అది కరోనా వైరస్ ఏ.. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికించేస్తోంది ఈ వైరస్. అలాంటి ఈ దారుణమైన వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టి ప్రస్తుతం ప్రపంచమంతా వ్యాపించి అందరిని పొట్టన పెట్టుకుంటుంది. ఇక అలాంటి ఈ దారుణమైన వైరస్ కారణంగా ఇరాన్‌లో ఒకేరోజు 49 మంది మృతి చెందారు. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టెహ్రాన్ ఇరాన్‌లో వైరస్ సంబంధిత మరణాలు రాత్రిపూట బాగా పెరిగాయని కరోనా వైరస్ కారణంగా 49 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి యానుష్ జహాన్‌పూర్ ఈరోజు తెలిపారు. కేవలం ఒకే ఒక్క రోజులో 49 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి యానుష్ తెలిపారు. 

 

కాగా ఇరాన్ లో 49 మృతి చెందగా.. దేశంలో మొత్తంగా 194 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. అంతేకాదు.. కేవలం ఒక్క రోజులో దాదాపు 743 మంది కొత్తగా వైరస్ బారిన పడ్డట్టు సమాచారం. అయితే ఇరాన్ లో మొత్తం బాధితుల సంఖ్య 6,566కు చేరింది. అయితే ఈ కరోనా వైరస్ తొలి కేసు ఫిబ్రవరి 19న నమోదయింది. అయితే కరోనా వైరస్ బారినుండి ఇప్పటికి దాదాపు 2,134 మంది బయటపడినట్టు జహాన్‌పూర్ తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: