ఏంటి ? మెట్రో రైలు ఢీ కొట్టిందా? అది కారుని? అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. నిజంగానే ఓ మెట్రో రైలు కారును ఢీ కొట్టింది. కానీ ఇక్కడ కాదు.. వాషింగ్టన్ లో ఈ ఘటన చోట చేసుకుంది. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెట్రో రైలు వస్తుంది అని పట్టాలపైకి ఎవరు రాకుండా.. వాహనాలు రాకుండా అధికారులు గేట్లు వేశారు. 

 

అయితే అటువైపుగా బీఎండబ్ల్యూ‌ కారులో వచ్చిన ఓ వ్యక్తి ఆ విషయాన్నీ ఏమాత్రం పట్టించుకోకుండా రైలు వచ్చేముందే పట్టాలు దాటేయాలని స్పీడ్ గా వెళ్ళాడు. అయితే అంతే స్పీడ్ గా మెట్రో రైలు కూడా వచ్చింది. దీంతో వేగంగా వచ్చిన మెట్రో రైలు కారును ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి. 

 

అయితే ఈ ప్రమాదంపై సంబంధించిన వీడియోను అమెరికాలోని లాస్ ఏంజెల్స్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూపించి ''రైల్వే ట్రాకుల వద్ద రోడ్డు దాటుతున్నప్పుడు.. పరిసరాలను జాగ్రత్తగా గమనించండి'' అంటూ ప్రజలకు సూచిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: