కరోనా వైరస్.. ఎంత డేంజరస్ వైరస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఈ డెంజర్స్ వైరస్ ప్రస్తుతం ప్రపంచమంతా వ్యాపించి అలజడి సృష్టిస్తుంది. ఇక పోతే ఈ డేంజరస్ వైరస్ కు అమెరికాను కూడా బెదరగొట్టింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

 

కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు శుక్రవారం ట్రాంప్ ప్రకటించారు. అదే విధంగా కరోనాను అరికట్టడానికి 50 బిలియన్‌ డాలర్ల నిధులు కేటాయిస్తున్నట్లు అయన వెల్లడించారు. ఈ మేరకు.. ''సమాఖ్య ప్రభుత్వ అధికారాలను అనుసరించి ఈరోజు జాతీయ ఎమర్జెన్సీ విధిస్తున్నాను''అని అయన ఓ పత్రికా సమావేశంలో ట్రంప్‌ ప్రకటన చేశారు. 

 

ఈ ప్రాణాంతక వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రైవేటు రంగంతో కూడా కలిసి పనిచేస్తుందని ట్రాంప్ పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ కరోనా దెబ్బకు అక్కడ అమెరికా విశ్వవిద్యాలయాలన్నీ మూతపడ్డాయి.. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా వైరస్ అంతం చేసేందుకు అన్ని దేశాల ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

అంతేకాదు ప్రతి ఆస్పత్రి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అమెరికన్ల వైద్య అవసరాలన్నింటినీ తీర్చేందుకు ప్రణాళికలలు సిద్ధం చెయ్యాలి అని ట్రాంప్ సూచించారు. అంతేకాదు కరోనా టెస్టులు నిర్వహించి, కేవలం రెండు గంటల్లోనే ఫలితాలు వెల్లడించేలా రెండు ల్యాబులు సిద్ధం చెయ్యాలి అని ట్రాంప్ ఆదేశాలు జారీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: