క‌రోనా వైర‌స్‌తో ప్ర‌పంచం గ‌డ‌గ‌డ‌లాడుతోంది. జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్తంగా మారుతోంది. దాని మాట వింటేనే ప్ర‌పంచ దేశాల‌గుండెల్లో ద‌డ‌పుడుతోంది. ఇక ప్ర‌పంచానికి పెద్ద‌న్న‌లా వ్య‌వ‌హ‌రిస్తున్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా ఎక్క‌డో క‌రోనా భ‌యం ప‌ట్టుకుంది. వెంటే వైస్‌హౌస్ వైద్యులు ఆయ‌న‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగెటివ్ రావ‌డంతో అమెరికా ఊపిరిపీల్చుకుంది. అయితే.. ట్రంప్‌కు ప‌రీక్ష‌లు ఎందుకు చేయాల్సి వ‌చ్చిందంటే.. ఇటీవ‌ల‌ బ్రెజిల్‌ ప్రతినిధి బృందం ఫ్లోరిడాలోని ట్రంప్‌ రిసార్ట్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంలో వారితో ట్రంప్‌ సన్నిహితంగా మెలగడంతో ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఈ ప‌రీక్ష‌లో నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని అధ్యక్షుడి వైద్యులు సీన్‌ కోన్లీ తెలిపారు. బ్రెజిల్‌ బృందంతో డిన్నర్‌లో పాల్గొన్న వారం రోజుల అనంతరం ట్రంప్‌నకు ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేవని ఆయన చెప్పారు. ఇదిలా ఉండ‌గా.. కరోనా వైరస్‌తో బాధపడుతూ అమెరికాలో ఇప్పటికే 51 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తుండగా..స్కూళ్లు, విద్యాసంస్థలు మూతపడ్డాయి.

 

అంతేగాకుండా డోనాల్డ్ ట్రంప్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు కూడా తీసుకున్నారు. యూకే, ఐర్లాండ్‌ల‌కు రాక‌పోక‌ల నిష‌ధాన్ని మ‌రింత‌గా పొడిగించారు. అమెరికాలో నేష‌న‌ల్ ఎమెర్జెన్సీ ప్ర‌క‌టించారు. యూస్ హౌస్ క‌రోనా వైర‌స్ రిలీఫ్‌బిల్‌ను ఆమోదించింది. న్యూయార్క్ సిటీలో మొట్ట‌మొద‌టి క‌రోనా వైర‌స్ డెత్ న‌మోదైంది. ఇక అమెరికా నుంచి దాదాపుగా అన్నిదేశాల‌కు పౌరుల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఈ క్ర‌మంలో ఆ దేశం నుంచి ఎవ‌రైనా వ‌చ్చారంటే.. వెంట‌నే ద‌వాఖాన‌ల‌కు త‌ర‌లించి, వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇక మ‌రికొన్న దేశాలు కూడా ప‌లు కీల‌క‌నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. కొలంబియా వెనిజులాతో బార్డ‌ర్‌ను మూసివేసింది. ఇక‌, బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బాయిస్‌నారోకు కూడా క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అయితే.. త‌న‌కు నెగెటివ్ రొపోర్డ్ వ‌చ్చింద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇలా దేశాధ్య‌క్షుల‌ను కూడా క‌రోనా వైర‌స్ గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: