ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న అతిపెద్ద సమస్య కరోనా. ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా గుప్పిట్లో ఉంది. దేశాధ్యక్షులు సైతం కరోనా ధాటికి కంగారుపడిపోతున్నారు. ఎలాంటి విపత్కర పరిణామాలైనా సరే సమర్ధవంతంగా ఎదుర్కుంటాం అంటూ బీరాలు పలికిన అగ్ర రాజ్య అధ్యక్షుడు కరోనా దెబ్బకి షేక్ అయ్యిపోతున్నాడు. తనకి ఈ వ్యాధి ఎక్కడ సోకిందోనని టెస్ట్ లు చేయించుకుని ఊపిరి పీల్చుకున్నారు..

IHG

ఇప్పటికే ఈ వైరస్ ధాటికి అమెరికాలో సుమారు 50 పైగా చనిపోగా, సుమారు  2329 మంది ఈ వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్నారు. భవిష్యత్తులో ఈ వైరస్ కంట్రోల్ అవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దాంతో ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటిచింది. స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీ లని కొంతకాలం పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది..ఈ పరిణామాలతో..

IHG

అమెరికాలో చదువుకోవడానికి  వలస వెళ్ళిన భారతీయ విద్యార్ధులు ఎంతో మంది తీవ్రమైన ఇబ్బందుకు ఎదుర్కుంటున్నారు. ఈ పరిస్థితిలలో ఏమి చేయాలో వారికి దిక్కు తోచడం లేదు దాంతో అందోళన చెందుతున్న విద్యార్ధులకి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తన సాయాన్ని ప్రకటించింది. స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీ మూసి వేత వలన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి ఆశ్రయం కలిపిస్తామని తమ టోల్ ఫ్రీ నెంబర్ 1-855 – OUR - TANA  కి ఫోన్ చేయమని వెంటనే తానా సభ్యులు స్పందించి సాయమందిస్తారని ప్రకటించింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: