కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రజలను వణికిస్తున్న వైరస్. ఇలాంటి రాక్షసత్వం ఉన్న ఈ వైరస్ ప్రస్తుతం ప్రజలను పీక్కు తింటూంటుంది. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ కారణంగా ఇప్పటికే మూడు వేలమందికిపైగా మరణించారు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ బారిన కొన్ని వేలమంది పడ్డారు. 

 

ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి అందరిని గజగజ వణికిస్తున్న ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది. అలాంటి దారుణమైన ఈ కరోనా వైరస్ భారత్ ను కూడా వణికిస్తోంది. ఈ కరోనా కారణంగా తెలంగాణాలో స్కూల్స్, కాలేజెస్, పబ్స్, మాల్స్ అన్ని మూతపడ్డాయి. మర్చి 1వ తేదీ వరుకు తెరవకూడదు అని తెలంగాణ సర్కార్ ప్రకటించింది. 

 

 

అలాంటి ఈ కరోనా వైరస్‌ వ్యాపించిన బాధితులకు సేవలు అందిస్తూ ఎందరికో చికిత్స చేస్తూ ప్రాణాలను రక్షిస్తున్నారు డాక్టర్లు. ఇక పోతే పైన ఉన్న ఫోటో గురించి మాట్లాడితే.. కరోనా బాధితులకు ఆమె సేవలు అందించి అలసిసొలసిపోయిన నర్సు ఆమె. ఇటలీలో కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 1441కి చేరింది. 

 

అసలు కాస్త కూడా తీరిక లేకుండా కరోనా వైరస్ బాధితులకు సేవలు అందించడంతో ఆమె పని చేస్తున్న చోటే అలసటతో ఆలా  నిద్రించింది. అయితే ఈ ఫొటోను తీసి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా.. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. అలా వైరల్ అయినా ఫొటోకు ఆమెకు వచ్చిన కామెంట్లకు, మెసెజ్ లకు ఆమె స్పందిస్తూ.. ''ఓ వైపు నా బలహీనతను చూస్తే బాధగా ఉంది. మరో వైపు నా కథ విన్నవారు పంపుతున్న మెసేజ్‌లు చూస్తుంటే ఆనందమేస్తోంది'' అంటూ ఆ నర్సు వ్యాఖ్యానించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: