ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పనులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. ఇంట్లో మన పిల్లలు చేసే పనులు చూసి మనం ఆశ్చర్యపోతే కొందరు అవే పనులను వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.. అవి వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ పాపకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.   

 

మీరు ఈ ఫోటో చూశారు కదా! ఆ ఫొటోలో పాపతో పాటు ఎవరో డ్యాన్స్ చేస్తున్నారు.. ఆ డ్యాన్స్ చేస్తుంది చూసి మీరు టెడ్డి బేర్ అనుకున్నారు కదా? అనుకోడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అది అలానే ఉంది. కానీ అది మీరు అనుకున్నట్టు ఎలుగుబంటి కాదు.. టెడ్డీబేర్ కాదు.. అది ఒక కుక్కపిల్ల. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికా మెయిన్ రాష్ట్రంలోని ఓ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న క్యారీ లెవన్ అనే మహిళా తన చిన్న కూతురు కుక్క పిల్లతో కలిసి డ్యాన్స్ చెయ్యడం చూసి ఆశ్చర్యపోయింది. దీంతో ఆ డ్యాన్స్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏంటో మీరు కూడా చూసేయండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: