ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 5,00,000 దాటింది. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. స్పెయిన్ లో వేల సంఖ్యలో కరోనా భారీన పడి మృతి చెందుతున్నారు. స్పెయిన్ రాజధాని మాడ్రిన్ లోని ఒక ఆస్పత్రిలో గుట్టులుగుట్టలుగా శవాలు పడి ఉన్నాయి. డాక్టర్లు ఎవరైనా చనిపోతారని అనిపిస్తే ముందుగానే డెత్ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. 
 
దేశంలో వైద్యుల సంఖ్య తక్కువగా ఉండటం... కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కొందరు ఆస్పత్రి వెయిటింగ్ రూమ్ లోనే చనిపోతున్నారు. వందల సంఖ్యలో మృతదేహాలు మార్చురీలో నిండిపోవడంతో ఐస్ రూమ్ లో స్టోర్ చేస్తున్నారు. చైనా, ఇటలీ కంటే వేగంగా స్పెయిన్ లో మృతుల సంఖ్య పెరుగుతోంది. కరోనా స్పెయిన్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. 
 
మొన్న కరోనా భారిన పడి 738 మంది చనిపోగా.. నిన్న 655 మంది చనిపోయారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి భారీ సంఖ్యలో మహిళలు హాజరు కావడంతో దేశంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. దేశంలో కేసుల సంఖ్య 851కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: