రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భారతీయులు ఎంతో మంది ఉన్నారు. స్వాతంత్ర్యం రాకముందు బ్రిటీష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకున్న తీరు, మనదేశంలో ఎంతో మందిని పొట్టన బెట్టుకున్న సంఘటనలు సమస్తం ప్రతీ ఒక్క భారతీయుడికి తెలిసినవే. కానీ ఇప్పుడు  చరిత్ర తిరగరాయబడుతోంది.... సుమారు 200 ఏళ్ళు భారత్ ని తమ ఆధీనంలో తీసుకుని సంపద అంతా దోచుకుని తమ దేశానికి తరలించుకు పోయి, భారతీయులని పొట్టన బెట్టుకున్న బ్రిటీష్ సామ్రాజ్యానికి ఇప్పడు అదే భారతీయులు దిక్కయ్యారు...

IHG

కరోనా తో బ్రిటీష్ దేశం యావత్తు అతలాకుతలమైపోతోంది.  ఆదేశ రాణి  కరోనా సోకినా అధికారికంగా ప్రకటన చేయలేదు. యువరాజు, ప్రధాని, ఆరోగ్య శాఖామంత్రి ఐసోలేషణ్ కి పరిమితం అయిపోయారు.దేశాన్ని గాడిలో పెట్టాల్సిన వాళ్ళే గాడిపొయ్యి దగ్గర చలికాచుకునే పరిస్థితి ఎదురయ్యింది. దాంతో పాలన స్థంబించి పోయే ప్రమాదంలో పడింది.మరి ఈ క్రమంలో బ్రిటీష్ రాజ్యాన్ని ఎవరు పాలించాలి..?? ఎవరికి ఇప్పుడు అధికారాని చేపట్టే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది..

IHG's BoJo's top 2 ministers are of <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIAN' target='_blank' title='indian-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>indian</a> origin | Deccan Herald

ఇలాంటి విపత్కర సమయాలలో గ్రేట్ బ్రిటన్ ఇంచార్జ్ గా చేసే అవకాశం ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్క్వార్ కానీ లేదా హోమ్ సెక్రెటరీ గాని తీసుకుంటారు. అయితే ఇక్కడ ఈ రెండు పదవుల్లో వెలుగుతోంది మన భారతీయులే. ఒకరి పేరు ప్రీతీ పటేల్ , మరొకరు రిషి సునక్. దాంతో ఇప్పుడు అంతా బ్రిటీష్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై వేచి చూస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో రవి అస్తమించని రాజ్యాన్ని భారతీయులు పాలించబోతున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: