కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నిటిని పట్టి పీడిస్తోంది. అగ్ర రాజ్యం అమెరికాపై తీవ్రమైన ప్రభావం చూపడంతో సుమారు 1,03,321 పాజిటివ్ కేసులు నమోదు కాగా 2000 లకి పైగా మంది మృతి చెందారు. న్యూయార్క్, న్యూజెర్సీ లలో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉండటంతో కట్టుదిట్టమైన బద్రతా చర్యలు చేపట్టారు. అయితే తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఉన్న దేశం అమెరికా కావడంతో తెలుగు రాష్ట్రాలకి చెందినా ఎంతో మంది ఎన్నారై కుటుంభ సభ్యులు ప్రభుత్వాలు అక్కడి వారికోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో...

IHG

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు తాళ్ళూరి జయ శేఖర్ ఓ ప్రకటన విడుదల చేశారు.అమెరికాలో కరోనా ఎంతో మందికి సోకినప్పటికి తెలుగు వారందరూ ఈ వైరస్ బారిన పడలేదని అందరూ సురక్షితంగా ఉన్నారని ప్రకటించారు. ఇదిలాఉంటే ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాలకి చెందిన ఏ ఒక్క తెలుగు వారు కోవిడ్ సోకిందని ఎవరూ తమని సంప్రదించలేదని , ఒహాయో ,ఫ్లోరిడా లకి చెందినా విద్యార్ధులు నిర్వాసితులుగా ఉండగా వారికి వసతి సౌకర్యాలు కల్పించామని తెలిపారు...

IHG

భారత కాన్సులేట్లతో కలిసి కోవిడ్ -19 కి సంభందించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనే విషయాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. స్వీయ నిర్భందం పాటిస్తే చాలు అదే దేశ సేవతో సమానమని ప్రకటించిన జయ శేఖర్ ఎవరైనా తెలుగు వారు ప్రమాదంలో ఉన్నామని ఆరోగ్యం బాలేదని తెలిపితే తానా తక్షణమే స్పందిస్తుందని ప్రకటించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: