కరోనా వైరస్.. ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది.. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 32వేలమంది మృతి చెందారు.. 6 లక్షలమందికిపైగా ఈ వైరస్ బారిన పడి ఆస్పత్రిపాలయ్యారు. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ చిన్న పిల్లలు.. వృద్దులు అని చూడటం లేదు.. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంది అంటే చాలు కరోనా వైరస్ వ్యాపించి ప్రాణాలు తీస్తుంది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల చిన్నారి ప్రాణాలు తీసింది కరోనా మహమ్మారి. పూర్తి కథలోకి వెళ్తే.. అమెరికాలోన చికాగోకు చెందిన నెలల పసికందు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందినట్లు ఇల్లినాయిస్‌ రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ తెలిపారు. 

 

అయితే ఇప్పటి వరుకు కరోనా వైరస్ బారినపడి వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రమే మరణించారు అని అయితే చిన్నారులలో చిన్నారి చనిపోవడం ఇదే ప్రథమం అని అధికారులు తెలిపారు. కాగా అమెరికాలో ఇప్పటి వరుకు 1.23లక్షల మంది కరోనా బారినపడ్డారు. అందులో రెండు వేలమందికి పైగా మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: