క‌రోనాతో అగ్రారాజ్యం అమెరికా క‌కావిక‌ల‌మ‌వుతోంది. ఓ వైపు వైర‌స్ వ్యాప్తి రోజురోజుకు అధిక‌మ‌వుతూ ప్ర‌జ‌ల ప్రాణాల‌ను తీసేస్తుండ‌గా...మ‌రోవైపు ఆర్థిక వ్య‌వ‌స్థ రోజురోజుకు దెబ్బ‌తింటోంది. వేలాది సంస్థ‌లు న‌డ‌ప‌లేని స్థితికి చేరుకుంటున్నాయి. ఇక గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో అక్క‌డ సంస్థ‌లు ఉద్యోగాల్లో కోత విధించ‌డం మొద‌లుపెట్టాయి. ఇప్ప‌టికే కొంత‌మందికి వేరే ఉద్యోగాలు చూసుకోవాలంటూ యాజ‌మాన్యాల నుంచి లెట‌ర్లు అందుతుండ‌టంతో ముఖ్యంగా అక్క‌డి ప్ర‌వాస భార‌తీయుల‌కు దిక్కుతోచ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. దీంతో హెచ్‌1బీ వీసాపై అమెరికాలో ఉంటున్న ప్ర‌వాసీయుల్లో ఆందోళ‌న మొద‌లైంది. అయితే ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత అమెరికాలోని నివాసం ఉండేందుకు ఉన్న గడువును పెంచాల‌ని కోరుతూ ప్ర‌వాసీయులు ట్రంప్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.'

 

 ప్రస్తుతం 60 రోజుల గడువు 180 రోజుల వరకు పెంచాలని వేలాదిమంది  శ్వేత‌సౌదానికి లేఖ‌లు రాస్తున్నారు.  ఇదిలా ఉండ‌గా ల‌క్ష‌మంది సంత‌కాల‌తో ఓ విజ్ఞాప‌న ప‌త్రాన్ని అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చేరేలా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు.  పన్నుల రూపంలో హెచ్1బి వీసా దారులు అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఎంతగానో అందిస్తున్నారు, ముఖ్యంగా ఐటీ రంగంలో విశేష కృషి చేస్తున్నారని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే 20 వేల మంది సంతకాలు చేశారు. ఇంకా 80వేల‌మంది సంత‌కాలు చేయాల్సి ఉంది. క‌రోనా ప్ర‌భావంతో ఇప్ప‌ట్లో అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ కోలోకోలేద‌ని అనేక అంతర్జాతీయ ఆర్థిక‌ సంస్థలు చెబుతున్నాయి.  

 

ఈ విష‌యాన్ని ట్రంప్ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌ల‌ను చూస్తే కూడా అర్థ‌మ‌వుతోంద‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉద్యోగాల కోత త‌ప్ప‌ద‌ని, నిరుద్యోగం పెరిగే ప్ర‌మాదం స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతోంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో నష్టాన్ని పూడ్చుకునేందుకు ఆయా సంస్థలు రానున్న కొన్ని వారాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోత విధించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సుమారు 4.5 కోట్ల మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక వైర‌స్ కార‌ణంగా వేలాదిమంది చ‌నిపోతున్నారు. సోమ‌వారం ఒక్క‌రోజే అమెరికాలో కొత్త‌గా 20వేల కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: