అగ్రరాజ్యం అమెరికాలో కరోనా  మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అగ్రరాజ్యంలో ఉన్నామన్న పేరుకే కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కరోనా  మహమ్మారి ధాటికి అమెరికాలో ఇప్పటి వరకూ సుమారు 2500  ప్రజలు మృత్యువాత పడగా, దాదాపు లక్షా ఇరవై వేల మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే

 

అమెరికాలో ఉంటున్న తెలుగు వారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం “నాట్స్”  కరోనా వైరస్ పై అవగాహన కల్పించడం కోసం వెబ్  నార్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కరోనా  బారిన పడకుండా ఉండటానికి ఏం చేయాలి , ఈ వైరస్ వలన శరీరంలో వచ్చే లక్షణాలు ఏమిటి అనే విషయాలపై ప్రముఖ వైద్యులు కె.వి సుంద రేష్, డాక్టర్ మధు కొర్రపాటి లు విలువైన సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. ఇదిలాఉంటే

 

ఈ వెబ్ నార్  కార్యక్రమం జరుగుతున్న క్రమంలోనే కరోనా బారినపడిన ఓ తెలుగు ఎన్నారై  తాను తీసుకున్న జాగ్రత్తలను, చెప్తూ మానసికంగా ఎలాంటి ధృడత్వంగా ఉండాలి అనే విషయాలపై ఎంతో మందికి సూచనలు చేశారు. వెబ్ నార్  ద్వారా ఇంతటి మంచి అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేసినా నాట్స్ కి ప్రతీ ఒక్కరూ కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇప్పటి వరకూ అమెరికాలో స్థానిక పౌరులకి మాత్రమే కరోనా సోకి ఉండగా మొదటి సారిగా తెలుగు ఎన్నారైకి సోకిందని అంటున్నారు నెటిజన్లు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: